థర్డ్ ఫ్రంట్‌తో ఒరిగేదేమీలేదు: కిషన్‌రెడ్డి

2

కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌ కుమార్ శాసన సభ్యత్వాలను రద్దు చేయడం సరైంది కాదని బీజేపీ నేత కిషన్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఏక పక్షంగా వ్యవహరిస్తుంది అని ఆయన అన్నారు….అలా కాకుండా అన్ని పక్షాలతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటే బాగుండేది అని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే సభ్యత్వాలను రద్దు చేయకుండా.. ఈ సెషన్ వరకు రద్దు చేస్తే సరిపోయేది అన్నారు. హైకోర్టు స్టేతోనై నా తెలంగాణా ప్రభుత్వంలో మార్పు రావాలి అన్నారు.

కేసీఆర్ థర్డ్ ఫ్రంట్‌ తో బీజేపీకి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. తెలంగాణ ప్రజల దృష్టి మరల్చడాని కే కేసీఆర్ ఫ్రంట్ డ్రామా ఆడుతున్నారన్నారు. టీఆర్ఎస్‌ పాలన లో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని కిషన్‌రెడ్డి తెలిపారు..కాగా … థర్డ్ ఫ్రంట్‌ విషయం ఫై నిన్న ( సోమవారం ) బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తో తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ సమావేశం అయిన విషయం తెలిసిందే ..తెలంగాణా అంతటా ఇప్పుడు “థర్డ్ ఫ్రంట్‌” విషయం ఫై చర్చ జరుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here