పనికట్టుకొని కొన్ని చానళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి : జనసేన

జనసేన పార్టీ పై కొన్ని చానళ్లు పనికట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేశ్‌ అన్నారు. తమ అధినేత పవన్‌ కల్యాణ్‌ ఓ ప్రముఖ జాతీయ చానల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెనుకబడిన ప్రాంతాలకు ఎక్కువ నిధులు కేటాయించాలని మాత్రమే చెప్పారనికానీ ఈ మాటల ను కొన్ని న్యూస్ చానల్స్ పూర్తి గా వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.ప్రతేక హోదా విషయంలో జనసేన వెనక్కి తగ్గదనిఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం తమ అధినేత పవన్ కళ్యాణ్ ఏ త్యాగానికైన సిద్దంగా ఉన్నాడని ఆయన తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓ సారి తమ గళం విప్పితే దేశ రాజకీయాలు పూర్తిగా మారిపోతాయన్నారు. పవన్‌ కల్యాణ్‌ హోదా కోసం పోరాటం చేస్తారని అయన మరో సారి తెలిపారు. 22 న జరిగే జాతీయ రహదారుల దిగ్భందనం పై తమ అధినేత నుంచి ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదనిజనసేన నాయకులుకార్యకర్తలకు ఎక్కువ సమయం అవసరం లేదనిపిలుపు వచ్చిన కొద్ది సమయంలో నే ఉద్యమించటాని సిద్దంగా ఉంటారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Show Buttons
Hide Buttons