ప్రారంభమైన సుమంత్ 25వ చిత్రం సుబ్రహ్మణ్యపురం

2
చాలా గ్యాప్ తరువాత “మళ్ళీ రావా” చిత్రంతో హిట్ అందుకున్న హీరో సుమంత్….ఆయన హీరో గా  నటిస్తున్న చిత్రం “సుబ్రహ్మణ్యపురం” ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. టారస్ సినీ కార్ప్ పతాకంపై ధీరజ్ బొగ్గరం, బీరం సుధాకర్‌రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతలు. షార్ట్ ఫిలిం డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈషా హెబ్బ ఇందులో హీరోయిన్.
పూజా కార్యక్రమాల అనంతరం హీరోహీరోయిన్లు సుమంత్, ఈషాపై మొదటి షాట్ అక్కినేని నాగచైతన్య క్లాప్‌నివ్వగా, దర్శకుడు ప్రశాంత్‌వర్మ కెమెరా స్విఛాన్ చేశారు. తొలి సన్నివేశానికి దర్శకుడు చందూ మొండేటి గౌరవ దర్శకత్వం వహించారు. చిత్ర లోగోను ఏపీ ఎంపీ జె.సి. దివాకర్‌రెడ్డి, కథానాయకుడు రాజశేఖర్, జీవిత విదుల చేసారు..
ఆ తరువాత హీరో సుమంత్ మాట్లాడుతూ…
 సాధారణంగా నా సినిమా ప్రారంభోత్సవ వేడుకలకు హడావిడి చేయడం నాకు ఇష్టం ఉండదు. ఇది నా 25వ సినిమా అని అందుకే సందడిగా ప్రారంభిస్తున్నామని నిర్మాతలు రెండు వారాల క్రితంచెప్పారు. వారు గుర్తు చేసేవరకు నాకు 25వ సినిమా అని తెలియదు. దర్శకుడు సంతోష్ మొదటిగా రెండున్నర గంటల పాటు కథ వినిపించారు. అందులోనే సినిమా మొత్తం చూపించారు. సూపర్ నాచురల్ అంశాల మేళవింపు తో సాగే మిస్టరీ థ్రిల్లర్ ఇది. ఈ జోనర్‌లో నేను సినిమా చేయడం ఇదే తొలిసారి. నాకు ఈ తరహా కథాంశాలతో సినిమాలు చేయడమంటే చాలా భయం. కానీ కథ నచ్చి ఈ సినిమాను అంగీకరించారు. కథ వింటున్నప్పుడు తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠతతో ఎదురుచూశాను. అని ఆయన అన్నారు.
హీరోయిన్ ఈషా హెబ్బ మాట్లడుతూ …సుమంత్‌కు తాను వీరాభిమానని, విభిన్నమైన కథలు, పాత్రలను ఎంచుకుంటూ ఆయన సినిమాలు చేస్తుంటాచని, సుమంత్‌తో సినిమా చేయడం ఆనందంగా ఉందని అన్నారు.
దర్శకుడు సంతోష్‌జాగర్లపూడి మాట్లాడుతూ దర్శకుడిగా నా తొలి సినిమా ఇది. ఇంతకుముందు మూడు లఘు చిత్రాలను రూపొందించాను. వాటికి సామాజిక మాధ్యమాల్లో ఇరవై ఆరు లక్షలవరకు వీక్షణలు లభించాయి. వాటికి వచ్చిన గుర్తింపును చూసి నిర్మాతలు ఈ సినిమాను రూపొందించే అవకాశమిచ్చారు. తొలుత సుమంత్‌కు సింపుల్‌గా కథను చెప్పాలని అనుకున్నాను. కానీ పాటలు, ఫైట్స్ తప్ప సినిమాలోని ప్రతి పాయింట్‌ను క్లియర్‌గా చెప్పాలని ఆయన అన్నారు . దాదాపు రెండున్నర గంటల పాటు కథ చెప్పగానే సినిమా చేస్తానని అన్నారు. ఏప్రిల్ మూడవ వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు అవుతుంది అని తెలిపారు.
నిర్మాత ధీరజ్ బొగ్గరం మాట్లాడుతూ సుమంత్ నటిస్తున్న 25వ సినిమా ఇది. మాగ్నస్ సినీప్రైమ్ సహకారంతో మా సంస్థ ద్వారా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. సుధాకర్‌రెడ్డి చక్కటి తోడ్పాటును అందిస్తున్నారు.తప్పకుండా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుందనే నమ్మకముంది అని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here