మార్చి 23 న‌ విజయ్ దేవరకొండ టాక్సీవాలా ఫస్ట్ లుక్

2
పెళ్లి చూపులు మూవీ తో హీరో గా ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ …ఆ మూవీ సూపర్ హిట్ కావటం తో యూత్ లో మంచి క్రాజ్ తెచ్చుకున్నాడు విజయ్ …ఆ తరువత వచ్చిన అర్జున్ రెడ్డి మూవీ తో యువ హీరోల్లో సెన్సేషనల్ స్టార్ గా స్టార్‌డ‌మ్ తెచ్చుకున్న‌ విజయ్ దేవరకొండ …. ఆ తరువాత ఆయన నటిస్తున్న తాజా చిత్రం టాక్సీవాలా. జిఏ 2 మరియు యువి పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఎస్ కె ఎన్ నిర్మాత‌. రాహుల్ సంకృత్యాన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. మే 18న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడ‌దుల‌వుతున్న ఈ చిత్రం మెద‌టి లుక్ ని మార్చి 23 న విడుద‌ల చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఆ చిత్ర నిర్మాత మాట్లాడుతూ… విజయ్ దేవరకొండకున్న క్రేజ్, పాపులారిటికి దృష్టిలో పెట్టుకుని ఈ క‌థ‌ని డైరెక్టర్ రాహుల్ త‌యారుచేశాడు. దానికి తగ్గట్టుగానే అన్ని వర్గాల్ని ఎంటర్ టైన్ చేసే విధంగా విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ను చూపించారు. విజయ్ మ్యానరిజమ్స్, బాడీ లాంగ్వేజ్, క్యారెక్టరైజేషన్ ఆడియెన్స్ ని మెస్మరైజ్ చేస్తాయి. డైరెక్టర్ రాహుల్ టేకింగ్, సుజిత్ విజువల్స్, జేక్స్ మ్యూజిక్, కృష్ణకాంత్ లిరిక్స్, జాషువా స్టంట్స్ టాక్సీవాలా లో హైలైట్ గా నిలుస్తాయి అని ఆయన పేర్కొన్నారు . స్ట్రాంగ్ కంటెంట్, ఆర్టిస్టుల పెర్ ఫార్మెన్స్ ను దృష్టిలో ఉంచుకొని ఈ చిత్రాన్ని గ్రాండియర్ గా నిర్మించాం. అన్నారు ప్రస్తుతం చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చివరి దశకు వచ్చింది. మే 18న టాక్సీవాలా ను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది అని ఆయన తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here