రంగస్థలం లో ఇంకో సాంగ్ కూడా ఉందంట …. ఆ పాటను ఎవరు పాడారో తెలుసా?

1
మెగా స్టార్ వారసుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తాజా గా నటించిన చిత్రం “రంగస్థలం”. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ  మూవీలో  టీజర్, పాటలు ప్రతి ఒక్కరిని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఎంత సక్కగున్నావే,  రంగా రంగా రంగస్థలాన,  రంగమ్మా మంగమ్మా, అనే పాటలు ఇది వరకు ఒక్కొక్కటిగా విడుదలై మంచి ఆదరణ అందుకోగా నిన్న ఆ గట్టునుంటావా నాగన్న, జిగేల్ రాణి ఈ రెండు పాటల తో కలిపి మొత్తం జుక్ బాక్స్ ని రంగస్థలం టీం విడుదల చేసింది.
ఇందులో ప్రతి పాట ను బాగా కనెక్ట్ అవుతున్నాయి.. జిల్ జిల్ జిగేలు రాణి అనే పాటకి “రామ్ చరణ్” తో పాటు పూజ హెడ్గే మొరువనుంది.  “మైత్రి మూవీ మేకర్స్” వారు నిర్మించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ను ఈనెల 18 న వైజాక్ లో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆడియో ఫై  ఏర్పాటు చేసిన కార్యక్రమం లో సుకుమార్ మాట్లడారు.
చంద్రబోస్ పాటలు రాసిన తర్వాత దేవీ ట్యూన్ కట్టారని.. అవన్నీ చాలా అద్భుతంగా వచ్చాయని అన్నారు. ఇప్పటి వరకు సినిమాలోని ఐదు పాటలను మాత్రమే రిలీజ్ చేశామని  మరో సప్రైజ్ ఉందని వెల్లడించారు. ఆల్బంలోని మరో  పాటను నేరుగా వెండితెరపైనే చూడాలని అన్నారు.  ఈ పాటను చంద్రబోసు పాడారు అన్నారు. సమంత హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, జగపతి బాబు, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ మార్చి 30 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here