రామ్ నెక్స్ట్ మూవీ ఎవ్వరి తో అంటే ?

యంగ్ హీరో రామ్ కెరీర్ లో కందిరీగ సూపర్ హిట్ తరువత వరుసగా ఎందుకంటే ప్రేమంట, ఒంగోలు గిత్త, మసాలా, పండుగ చేసుకో ,శివం వరుసగా ప్లాఫ్ లు అందుకున్న తరువాత కిషోర్ తిరుమల దర్శకత్వం లో నేను శైలేజ అనే మూవీ చేసి హిట్ కొట్టాడు మళ్ళి అదే కాంబినేషన్ లో ఉన్నది ఒకటే జిందగీ సినిమాతో డిసెంట్‌ హిట్ అందుకున్న రామ్‌…. ప్రస్తుతం త్రినాథ్‌ రావు నక్కిన దర్శకత్వంలో “హలో గురు ప్రేమకోసమే“ అనే సినిమా చేస్తున్నాడు.
రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ చిత్రానికి దిల్‌ రాజు నిర్మాత . ఈ సినిమా పూర్తి అయిన తరువాత తరువాత రామ్‌ ఓ అడ్వంిచరస్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌లో  చేయ్యనున్నాడు. ఈ చిత్రానికి దర్శకుడు ఈ మధ్య నే రాజశేఖర్  కం బ్యాక్ ఫిలిం “గరుడ వేగా” తీసిన ప్రవీణ్ సత్తరు… రామ్ కి ఒక స్టొరీ చెప్పగా ఆ స్క్రిప్ట్ రామ్ కి నచ్చడం తో త్వరలో చిత్రాన్ని స్టార్ట్ చెయ్యనున్నారు… పూర్తి యాక్షన్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కనున్న ఈ సినిమా ఎక్కువ భాగం వఅమెరికా వంటి  దేశాల్లో చెయ్యనున్నారు. మొదటగా ఈ స్క్రిప్ట్ నితిన్ తో చేద్దాం అనుకున్నాడు ప్రవీణ్ ..కానీ నితిన్ కి బిజీ కాల్ షీట్స్ తో ఈ స్క్రిప్ట్ ఇప్పుడు రామ్ దెగ్గరికి వెళ్ళింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Show Buttons
Hide Buttons