సవ్యసాచి ఫస్ట్ లుక్ తో ఫస్ట్ పంచ్ ఇచ్చిన చైతు !!

3
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ ఫై .. యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ప్రథాన పాత్ర లో వస్తున్నా సినిమా “సవ్యసాచి”. కార్తికేయ,ప్రేమమ్ లాంటి సూపర్ హిట్ సినిమాల దర్శకుడు చందు మొండేటి ఈ చిత్రానికి దర్శకుడు . ఈ సినిమా లో చైతన్య కు జంటగా “నిధి అగర్వాల్” నటిస్తోంది. ఈ రోజు ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు చిత్ర యూనిట్. చైతు ఫస్ట్ లుక్‌ ని ఫస్ట్ పంచ్‌గా చిత్రబృందం రిలీజ్ చేసింది.ఈ చిత్రం లో కీలక పాత్రల్లో తమిళ హీరో మాధవన్, అలనాటి హీరోయిన్ భూమిక చావ్లా, కమెడియన్ వెన్నెల కిషోర్ మరియు రావు రమేష్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కు ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.
తన రెండు చేతులను కరెక్ట్ గా శక్తివంతంగా వాడే వాళ్లని “సవ్యసాచి” అంటారు ఆ విషయం అందరకి తెలిసిందే. మహాభారతం లో అర్జునడి ఐదవ పేరు “సవ్యసాచి”……. అర్జనుడు తన రెండు చేతుల తో ఒకే వేగం తో విలు విద్య ప్రదర్శించగలడు. అలాగే ఈ చిత్రంలో హీరో రెండు చేతుల ని సమర్థవంతంగా వాడి పరిస్థితులని,ప్రత్యర్థులని ఎదుర్కుంటాడు అని “సవ్యసాచి” టీం రిలీజ్ చేసిన పోస్టర్ లో మనకు క్లారిటీ గా కనిపిస్తుంది. ఇందులో నాగ చైతన్య లుక్ కొత్తగా ఉంది… షూటింగ్ ఫైనల్ స్టేజి కి వచ్చిన ఈ చిత్రం.. మే 24 న రిలీజ్ చెయ్యాలి అని మొదటగా చూసిన… నాగార్జున – రామ్ గోపాల్ వర్మ “ఆఫీసర్” 25 న రిలీజ్ అవ్తుంది… కాబట్టి పోస్ట్ పోన్ చేసే ఆలోచన లో ఉన్నారు “సవ్యసాచి” చిత్ర దర్శక నిర్మాతలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here