శ్రీ రెడ్డి కి దిమ్మతిరిగే కౌంటర్లు తో ఒక సామాన్యుడి లెటర్

4
A Common Man Letter to Sri Reddy Over Tollywood Casting Couch

ఈ మధ్య కాలం లో ఏ న్యూస్ చుసిన ఎక్కడ విన్న శ్రీ రెడ్డి పేరే …కాగా ఒక సామాన్య వక్తి రాసిన ఒక లెటర్ ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అయ్యింది …ఆ లెటర్ లో కొన్ని ప్రశ్న లు ఉన్నాయి వాటికీ శ్రీ రెడ్డి జవాబు ఇస్తే మేము కూడా మీతో ఉద్యమం చెయ్యటానికి సిద్దం అని తెలిపారు..

ఆ ప్రశ్నలు :  

1. పది పన్నెండేళ్లుగా తెలుగు సినిమా ఫీల్డ్ లో ఉన్న మీరు చేసినవి రెండే రెండు సినిమాలు. అవి కూడా ఎప్పుడొచ్చాయోఎప్పుడు పోయాయో ఎవరికీ తెలీదు. వాటిలో మీ పాత్రేమిటో అసలే తెలీదు. ఈ పదేళ్లు నెలకి కనీసం రెండు లక్షల రూపాయల ఖర్చుతో మీరెలా బ్రతికారు. ఒక కారుఒక ఖరీదైన అద్దె అపార్ట్ మెంట్ ఎలా మెయింటెయిన్ చేస్తున్నారో చెప్పగలరా..?

2. దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన మీకు అసలు డబ్బులెలా వచ్చాయి..ఒక ఆడపిల్ల మీరేసుకుంటున్న స్థాయి బట్టలతో నెల మెయింటెయిన్ చేయాలంటే కనీసం లక్ష రూపాయలు అవసరమవుతాయి. మీకు డబ్బెక్కడినుంచి వస్తోంది..ఎవరిస్తారు..మీకు నెల మొత్తం ఎలా గడుస్తోంది..?

3. అవకాశాలిప్పిస్తామని మిమ్మల్ని అందరూ వంచించారని చెబుతున్నారు కదా..మీరు ఎవర్నీ కాంటాక్ట్ చేయకుండానేమీరు ఎవరికీ అవకాశమివ్వకుండానే వాళ్లంతట వాళ్లే మిమ్మల్ని వంచించారా..?(ఇక్కడ మీ ప్రత్యర్ధుల్ని సమర్ధిస్తున్నామని అనుకోకండి). మీ ప్రోద్భలం లేకుండానే ఇన్ని వ్యవహారాలూ జరిగాయా..మీరు చూపెడుతున్న ఛాటింగ్ స్క్రీన్ షాట్లు అన్నింటిలోనూ వాళ్లూ మాట్లాడారుమీరు మాట్లాడారు. వాళ్లు మిమ్మల్ని బేబీ అంటేమీరు హనీ అన్నారు. మీ అవసరాన్ని వాళ్లువాళ్ల అవసరానికి మీరు ఒకరినొకరు వాడుకున్నారు. ఎందుకండీ దీనికి విలువలుస్త్రీలను లోబరుచుకోవడాలు అంటూ పెద్ద పెద్ద మాటల. మీ ప్రమేయం లేకుండామీరు గెస్ట్ హౌస్ లకు వెళ్లకుండా మీరు పబ్బులకు,క్లబ్బులకు తిరక్కుండామీరు రెచ్చగొట్టకుండా మిమ్మల్ని సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా లోబరుచుకున్నారా..? (ఇలా అడిగానని క్యాస్టింగ్ కౌచ్ ను ఎంకరేజ్ చేస్తున్నామని అనుకోకండి). పదేళ్ల క్రితం మీరు సినీఫీల్డ్ కు వచ్చారు. ఇండస్ట్రీలోని క్యాస్టింగ్ కౌచ్ పై పోరాడాలని పదేళ్ల తర్వాత కానీ మీకు అనిపించలేదా..మొదటిసారి మిమ్మల్నెవడో వంచించినప్పుడుమీలో శ్రీశక్తి ఎందుకు మేలుకోలేదు..ఆరోజు విలువలెందుకు గుర్తు రాలేదు..?

నిర్మాత డి సురేష్ బాబు కొడుకు అభిరామ్ తో మీరు దిగిన ఫొటోలు చూస్తేఅసలు ఎవడైనా క్యాస్టింగ్ కౌచ్ అని అనుకుంటాడా..మీరుఅతను తిరగాల్సినంత తిరిగిఎంజాయ్ చేసినంత ఎంజాయ్ చేసిఇప్పుడు మీమధ్య చెడింది కనుకరచ్చకెక్కడం జనానికి వినోదం పంచడం కాదా..తెలుగమ్మాయిలకు అవకాశాలివ్వడం లేదని అన్నారు. సినిమా ఇండస్ట్రీ డబ్బుప్రతిభ ఆధారంగా నడిచే పరిశ్రమ. తెలుగమ్మాయిలు అద్భుతంగా నటిస్తే అవకాశాలివ్వరా..ఈ గ్లోబలైజేషన్ రోజుల్లో టాలెంట్ ను కేవలం తెలుగమ్మాయిలు,తమిళమ్మాయిలు అన్న కొలమానంతో ఎవరు చూస్తున్నారు..ఒక్క డైరెక్ట్ క్వశ్చన్.. అనుష్కతమన్నాసమంతనిత్యామీనన్రకుల్ ప్రీత్శృతి హాసన్..వీళ్లందరితో పోలిస్తే మీరు అందంగా ఉంటారా..వీళ్ల కంటే బాగా నటించగలుగుతారా..అసలు వాళ్లతో మీకు పోలికుందా..అసలు మిమ్మల్ని హీరోయిన్ గా పెట్టి ఎవ్వడైనా సినిమా తీయగలడా..నిజం చెప్పండి..

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఖచ్చితంగా ఉంది. ఎప్పటినుంచో ఉంది. అయితే అది పూర్తిగా పరస్పర అవగాహనతోఅవసరాల కోసం చేసేది. అయినంత మాత్రాననటన రాని వాళ్లకుఅందం లేని వారికి పడుకుంటే అవకాశాలిచ్చేస్తారా..తెలుగులో ఈమధ్య కాలంలో వచ్చిన అంజలిమాధవి లతఅర్చనజూనియర్ సుహాసినిశ్రీవిద్య వీళ్లంతా అద్భుతమైన నటీమణులా..తెలుగులో దర్శకులకుహీరోలకు ఎవరితో సినిమాలు తీయాలో తెలియదా..నిజంగా గుండెల మీద చెయ్యేసుకుని చెప్పండి..మిమ్మల్ని హీరోయిన్ గా పెట్టి ఎవ్వడైనా సినిమా తీయగలడా..కామెడీ కాకపోతే..!

నిజంగా మీరు సినిమా ఇండస్ట్రీ బాగు కోసమోక్యాస్టింగ్ కౌచ్ ను అరికట్టడానికో అభిరామ్ దుర్మార్గాన్ని బయటపెట్టడానికో అయితేనేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ చేసేవారు. మీరు టీవీ ఛానెల్స్ కు వెళ్లిన రోజేమీ లక్ష్యమేంటో అందరికీ అర్ధమైంది. కాకపోతేఅందరికీ అన్నీ తెలిసినాఎంటర్టైన్ మెంట్ కోసం ఓ పదిరోజులు మీ తమాషా చూశారు. ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో చివరికి బలయ్యేది ఎవరో తెలుసా..మీరే..! ఈ రెండు రాష్ట్రాల్లో గడిచిన ముప్ఫై ఏళ్లలో పేపర్లు కానీటీవీ ఛానెల్స్ కానీ ఏ సమస్యనూ పరిష్కరించలేదు. కొన్ని పరిష్కారాలు కాలనుగుణంగా జరిగాయంతే..ముఖ్యంగా న్యూస్ ఛానెల్స్ మీలాంటి వాళ్లు అప్పడప్పుడూ దొరికే జున్ను ముక్కల్లాంటోళ్లు. మీరు టీవీ ఛానెల్స్ ను వాడుకోవాలని మీరనుకుంటేమిమ్మల్ని సాంతం వాడేయాలని వాళ్లనుకున్నారు. అసలొక టీవీ ఛానెల్ మీ సమస్యకు పరిష్కారం ఎలా చూపెడుతుందో చెప్పండి..ఎంత పిచ్చిదానివి శ్రీరెడ్డీ నువ్వు..?

ఇంకా రెండు రోజుల కంటే ఎక్కువ నిన్ను టీవీ ఛానెళ్లుజనాలు భరించలేరు. జనానికిటీవీలకు మరో కొత్త ఇష్యూ కావాలి. పబ్లిక్ దృష్టిలో నువ్వెప్పుడో చీప్ అయిపోయావు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరైనా నీకు కాల్ చేయాలంటే భయపడుతున్నారు. కనీసం నీకు అవకాశం ఇవ్వాలనుకునేవాళ్లు కూడా లేనిపోని తలనొప్పులు దేనికిలే అని దూరంగా ఉంటారు. ఏదో లబ్ధి కోసం నువ్వుమీడియాలో కొందరు కలిసి వేసిన ఎత్తుగడచివరికి నిన్ను దారుణంగా బలితీసుకుంటుంది. నిన్ను రోజూ చూపిస్తే రేటింగ్ రాదు. అందుకని టీవీ ఛానెల్స్ నిన్న వదిలేసుకుంటాయి. రోజూ నువ్వు బట్టలిప్పినా చూడాలనే ఆసక్తి కూడా ఎవరికీ ఉండదు. అవకాశాలు తన్నుకుంటూ రావడానికి నువ్వు మహానటివీ కాదు. నీకిదంతా అర్ధమయ్యేటప్పటికిజరిగాల్సిన డ్యామేజ్ ఎప్పుడో జరిగిపోయింది. టీవీ న్యూస్ ఛానెల్స్మా అసోసియేషన్ సినిమాల్లో కొందరు పెద్దలుమీడియా వాళ్లుఅందరూ చివరికి ఒక్కటై నిన్ను ఆల్రెడీ ముంచేశారు. ఒక నెలల తర్వాత అసలేం జరిగిందో నీకు అర్దమవుతుంది. కానీ అప్పటికేకథ ముగిసిపోతుంది.

గత కొద్దికాలంగా నీ పనులకు విసిగిపోయి ఉన్న
ఒక సామాన్యుడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here