రాజీనామాకు కారణం ఏంటో చెప్పిన అశోక్ గజపతిరాజు

మంత్రి అశోక్‌గజపతి రాజు తన మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే… అయితే అయిన రాజీనామా కి గల కారణాలు ఈ రోజు వివరించారు… విభజన తో ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం జరిగిందని అంటూ… ఆర్థిక లోటుతో ఇబ్బంది పడుతున్న ఆంధ్రప్రదేశ్ కి కేంద్రం నుంచి నాయ్యం కావాలి అని అన్నారు.
కేంద్రం ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయలేదని..హోదాకు బదులు ప్యాకేజీ ఇస్తామని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారని….అది కూడా ఎమాత్రం సరిగా అమలు చేయలేదని ఆయన అన్నారు.. అందుకే తన మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు అశోక్‌ గజపతిరాజు తెలిపారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి ఆంధ్రప్రదేశ్ ని అన్నివిధాలా ఆదుకోవాలని అశోక్ గజపతిరాజు డిమాండ్ చేశారు.
 పార్లమెంట్‌ లో టీడీపీ ఎంపీల ఆందోళనలు ఇంకా …. కొనసాగుతున్నాయి. ఈ రోజు ఉదయం సభ ప్రారంభం కాగానే తెలుగు ఎంపీలు విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.  మార్చి 5 నుంచి పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్నాయి… మరి కొద్ది రోజుల్లో ముగియనున్నాయి. ఈ లోపు ఎలాగిన ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అని ఎంపి లు గట్టిగా డిమాండ్ చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Show Buttons
Hide Buttons