ఉగాది అంటే ఏంటో మీకు తెలుసా ?ఎందుకు జరుపుకుంటారు? ….ఎలా జరుపుకుంటారు?

44
కొత్త ఏడాది అనగానే మనకు గుర్తుకు వచ్చేది జనవరి 1 వ తేది….నిజానికి జనవరి 1 వ తేది కొత్త ఏడాది కాదు…జనవరి అనేది ఆంగ్ల పదం …మనకు కొత్త ఏడాది అంటే ఉగాది అదే రోజు మనకు కొత్త ఏడాది స్టార్ట్ అయినట్లు…ఉగాది అసలు పేరు యుగ,ఆది కాల క్రమేపి ఉగాది గా మారింది.
అసలు ఉగాది ఎందుకు జరుపుకుంటారు? ….ఎలా జరుపుకుంటారు?
ఉగాది రోజున బ్రహ్మ సృష్టిని ప్రారభించాడు అంటారు…. మనకు ఏడాది కాలం బ్రంహ కి ఒక రోజు…అంటే మన ప్రతి ఉగాది బ్రంహ కు ఒక రోజు అన్నట్లు….
అసలు కథ లో కి వస్తే….
కొమకాసురుడు అనే రాక్షషుడు బ్రహ్మ దగ్గర ఉన్న వేదాలు దొంగతనం చేసి సముద్రం లో దాచుతాడు….అప్పుడు విష్ణుమూర్తి మత్స్య అవతారం లో వచ్చి ఆ సముద్రం లో ఉన్న కొమకాసురుడు న్ని చంపి ఆ వేదాలను బ్రహ్మ కు ఇస్తాడు విష్ణు మూర్తి..వేదాలను తీసుకున్న బ్రహ్మ ఆ రోజు సృష్టి ని ప్రారంభించాడు….
అప్పటి నుంచి ఆ రోజున మనం కొత్త ఏడాది గా జరుపుకుంటాం.. ఉగాది ని ఒక్క ఆంద్ర,తెలంగాణా లో కాకుండా మహారాష్ట్ర,కేరళ,పంజాబ్,అస్సాం లలో కూడా జరుపుకుంటారు. ఉగాది ని పంజాబ్ లో వైషాకి, మహారాష్ట్ర లో గుదిపదవ, అస్సాం లో బాహు, కేరళ లో కొల్ల వర్షం అని పిలుస్తారు….
ఉగాది  రోజున ఉదయన్నే లేచి తలంటు స్థానం చేసి కొత్త బట్టలు వేసుకొని..6 రుచుల ఉగాది పచ్చడి ని తిని …పంచగ శ్రవణం చేస్తాం…
అందరికి ఉగాది పండుగ శుభాకాంక్షలు ….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here