గురజాల పాతపాటేశ్వరి అమ్మవారి దేవాలయం

43
500years Old Temple Pathapateswari Temple in Paldandu @gurajala in Guntur

శ్రీ పాతపాటేశ్వరి అమ్మవారు దేవాలయం గుంటూరుజిల్లా, గురజాల పట్టణంలో ఉంది. భక్తల కొంగుబంగారమై విరసిల్లుతున్న పాతపాటేశ్వరి అమ్మవారును సుమారు 1000 సంవత్సరాల కిందట దుగ్గరాజు వంశం వారిచే ప్రతిష్ఠగావించబడినట్లు దేవాలయంలోని శాసనం ద్వారా తెలుస్తుంది. అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ. శ్రీ ఆదిపరాశక్తి స్వరూపిణి అయిన శ్రీ పాతపాటేశ్వరి అమ్మవారిని సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం గురజాల పట్టణంలో దుగ్గరాజు వంశీకులచే ప్రతిష్టించినటు ఆలయంలోని శాసనాల ద్వారా తెలు స్తోంది. క్రీ.శ. 11వ శతాబ్దంలో పల్నాటి నాయకురాలైన నాగమ్మ ఈ అమ్మవారికి భక్తి ప్రపత్తులతో పూజలు జరిపినటు పెద్దలు చెబుతూ ఉంటారు. వీరశైవ భక్తురాలైన నాగమ్మ గురజాల గ్రామంలో ఉన్న శ్రీ ముక్కంటేశ్వరుడు, శ్రీ వీరభద్రస్వామి, శ్రీ పాతపాటేశ్వరి అమ్మవార్లను కొలిచినట్లు ఆలయశాసనాల ద్వారా తెలుస్తోంది.

500years Old Temple Pathapateswari Temple in Paldandu @gurajala in Guntur

ఎంతో మహిమాన్విత మైన ఈ పుణ్యక్షేత్రం శిథిలమై తిరిగి 1828వ సంవత్సరంలో అప్పటి కలె క్టర్ ఓర్స్ దొర అమ్మ వారి మహిమలకు ముగుడై నిత్య నైవేద్య దీపా రాదనల నిమిత్తం సుమారు 40 ఎకరాల భూమిని ఇనాముగా ఇచ్చారు. అమ్మవారికి ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ ఏకాదశి నుంచి మార్గశిర శుద్ధ పౌర్ణమి వరకు తిరునాళ్ల బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్స వాల్లో ఏకాదశి రోజున బియ్యం కొలిచి, ముడుపుకడితే నాలుగో రోజు అమ్మవారి మహిమ వల్ల రెట్టింపు అవుతాయని భక్తుల విశ్వాసం. සයී రోజు అనగా పున్నమి రోజున అమ్మవారి తిరునాళ్ల చేస్తారు. ఈ ఉత్స వంలో ముఖ్యమైనది సిడిమాను (సిరిమాను) ఉత్సవం. అమ్మవారి సిడి మానుకు రైతులు తమ పొలాల్లో పండించిన గుమ్మడి కాయలు, సోర కాయలు, ఇతర ధాన్యాలు కడతారు. పూర్వపు రోజులలో అమ్మవారు దేవాలయంలో జంతు బలులు జరిగేవి. దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారులు వన్యప్రాణి సంరక్షణ చట్ట కింద దీనిని నిషేదించారు.

500years Old Temple Pathapateswari Temple in Paldandu @gurajala in Guntur

మహిమ 1826 ప్రాంతాన శిస్తు వసూలు నిమిత్తం గురజాల వచ్చిన కలెక్టర్ ఓర్స్ దొర అధికార గర్వంతో ఆలయ ప్రాంగణంలోనే బస చేసి, గుర్రా లను కట్టివేశాడు. అవి కిందపడి గిలగిల తన్నుకోగా, అప్పటి దేవాలయ సిబ్బంది ఇదంతా అమ్మవారి ఆగ్రహంతో జరిగినదని, వెంటనే క్షమా పణ వేడుకుంటే అవి యధాస్థితి పొందుతాయని చెప్పారు. అప్పుడు ఆయన తన అపరాధాన్ని మన్నించమని అమ్మవారిని వేడుకోగా, గుర్రా లన్నింటికి స్వస్తత చేకూరినట్లు, అప్పుడు ఓర్స్ దొర సంతోషంతో అమ్మ వారికి 40 ఎకరాల భూమిని ఇనాముగా ఇచ్చినట్లు శాసనం చెబుతోంది. అమ్మవారు ఆలయం ప్రతి సంవత్సరం శరన్నవ రాత్రులలో అమ్మవారికి జరిగే పూజలు ఎంతో ప్రశస్తమైనవి. ఈ దేవాలయంలో అమ్మవారికి లలితా సహస్రం, లక్ష్మీ సహస్రం, త్రిశతి ఖడ్గములతో పూజలు జరుపుతారు. శ్రీ పాతపా టేశ్వరి అమ్మవారి ఆలయం పల్నాడులోనే విశిష్టమైనదని పల్నాటివాసులు చెప్పుకుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here