ముక్తి నిచ్చే మూకాంబిక ఆల‌యం (part -2)

49
Amazing Facts of KOLLUR MOOKAMBIKA TEMPLE

ఆల‌యానికి మార్గం మూకాంబిక ఆల‌యం :

కొల్లూర్ మూకాంబిక మెటల్ రోడ్డు ద్వారా చేరుకునే వీలు కలిగి ఉండి, మంగుళూరు, ఉడుపి, మరియు కుందాపూర్ నుండి నేరుగా బస్సులు ఉన్నాయి. కొంకణ్ రైల్వే దారిలోని కుండాపూర్ లేక మూకాంబికా రోడ్డు ( బైన్డూర్) లు అత్యంత చేరువలో ఉన్న రైల్వే స్టేషన్లు.
నివాస వసతులు  :

కొల్లోర్ లో అనేక లాడ్జింగ్లు ఉన్నాయి. దేవాలయ దేవస్వాం సౌపర్ణిక అనే ఒక వసతిగృహాన్ని నిర్వహిస్తుంది.

శ్రీ లలితాంబికా వసతిగృహం, మాతా ఛత్రం వసతి గృహం, గోయంకా వసతి గృహం మొదలగునవి కూడా అందుబాటులో ఉన్నాయి. మొత్తం మీద ఈ సదుపాయాలతో దాదాపుగా 400 గదులు ఉన్నాయి. గది అద్దెలు సామాన్య భక్తులకు అందుబాటులోనే ఉంటాయి. ఒంటరి సందర్శకులకు బస్సు స్టాండు సముదాయము యొక్క ఆవరణలోనే ఒక డార్మిటరీ ఉంది. మరొక సదుపాయం అయిన అతిథి మందిర రామకృష్ణ యోగాశ్రమంచే నిర్వహించబడుతుంది.

Amazing Facts of KOLLUR MOOKAMBIKA TEMPLE

మూకాంబిక ఆల‌యం పురాణా చ‌రిత్ర‌ :

పురాణాల ప్రకారం, కోల మహర్షి ఇక్కడ తపస్సు చేస్తుండగా, శివ భగవానుని మెప్పించి, వరం పొందడానికి తపస్సు చేసుకునే ఒక రాక్షసుడి వలన ఆయన మనోవిచలితులయ్యాడు. ఆ రాక్షసుడు తన దుష్ట కోరిక నేరవేర్చుకోకుండా ఉండడానికి, ఆది శక్తి అతనిని మూగవానిగా (మూక) చేయగా, దేవుడు ప్రత్యక్షమైనప్పుడు అతడు ఏమీ అడగలేకపోయాడు. దానితో అతను కోపధారి అయి, కోల మహర్షిని వేధించగా, ఆయన ఆది శక్తిని రక్షించమని వేడుకున్నారు. మూకాసురుని సంహరించిన ఆది శక్తిని దేవతలదరూ మూకాంబికగా స్తుతించారు. కోల మహర్షి యొక్క పూజ వద్ద దైవ మాత మిగిలిన అందరు దేవతలతో సహా ఉండిపోయి, భక్తులతో పూజింపబడుతుంది.

Amazing Facts of KOLLUR MOOKAMBIKA TEMPLE

శ్రీ ఆది శంకరాచార్యకు శ్రీ మూకాంబికా దేవి కలలో కనిపించగా, ఆయన ఈ దేవత విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారని నమ్ముతారు.ఆ కథ ఇలా నడుస్తుంది. ఆది శంకర కుడజాద్రి కొండలలో ధ్యానం చేస్తున్నపుడు, దేవి ఆయన ఎదుట ప్రత్యక్షమై నీ కోరిక ఎరింగింపుము అని దేవి అడిగింది.

Amazing Facts of KOLLUR MOOKAMBIKA TEMPLE

ఆయన దేవిని కేరళలోని ఒక ప్రాంతంలో తాను పూజ చేసుకునేందుకు వీలుగా ప్రతిష్ఠించాలనే తన కోరికను తెలిపారు.దేవి దానికి అంగీకరించి, ఆది శంక‌రునితో బ‌య‌ల్దేర‌డానికి సిద్ద‌ప‌డింది. అయితే వెనుక‌నే వ‌స్తాను. గమ్యం చేరే వరకు వెన‌క్కి తిరిగి చూడరాదని తెలిపింది. అందుకు శంక‌రుడు అంగీక‌రించాడు. అలా వెడుతుండ‌గా దేవి యొక్క కాలి గజ్జల శబ్దం వినబడకపోవడంతో, శంకరులు హఠాత్తుగా తిరిగి చూశాడు. వెంటనే దేవి విగ్ర‌హంగా మారిపోయింది. తన విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయమని ఇక్క‌డే ఆప‌ని నిర్విగ్నంగా చేయ‌మ‌ని ఆదేశించింది. అలానే శంక‌రులు విగ్ర‌హ‌ప్ర‌తిష్ట‌చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here