అలంకారం శక్త్యి అవతారిక “గాయత్రి దేవి”

28
Gayathri Devi (గాయత్రీ దేవి స్తోత్రం)Telugu

గాయత్రి సకల వేద స్వరూపిణి. అన్ని మంత్రాలకు మూల శక్తి. అందుకే గాయత్రి మంత్రం మూలమంత్రం. తల్లి ఐదు ముఖములతో ప్రకాశిస్తూ ఉంటుంది – అవి ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలలో ప్రకాశిస్తూ ఉంటాయి. చేతులలో శంఖ, చక్ర, గద, అంకుశాదులు ధరించి దర్శనమిస్తుంది. పురాణాల ప్రకారం ఆమె ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపఈ రుద్రుడు ఉంటారని తెలుస్తోంది.

అమ్మ ప్రాతఃకాలంలో గాయత్రిగానూ, మధ్యాహ్నకాలంలో సావిత్రిగాను, సాయంసంధ్యలో సరస్వతిగానూ పూజింపబడుతుంది. గాయత్రీ ధ్యానం అనంత మంత్రశక్తి ప్రదాత. అన్ని కష్టాలు, ఉపద్రవాలు శాంతిస్తాయి. గాయత్రి ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతం అవుతుంది. శ్రీ ఆది శంకరులవారు గాయత్రీమాతను అనంతశక్తి స్వరూపంగా అర్చించారు. గాయత్రీ మంత్ర జపం చతుర్వేద (నాలుగువేదాల) పారాయణం అంత ఫలితాన్ని ఇస్తుంది.

నవరాత్రులలో అమ్మవారిని ఉపాసన చేసి, అల్లపు గారె నివేదన చెయ్యాలి. గాయత్రి స్వరూపంగా వేదం చదువుకున్న బ్రాహ్మణులకు అర్చన చెయ్యాలి. గాయత్రి స్తోత్రాలను పారాయణ చెయ్యాలి.

|| ముక్తా విద్రుమ హేమ నీల
ధవళచాయై ముఖైస్త్రీ క్షణైః
యుక్తామిందు నిబద్ధరత్న మకుటామ్
తత్వార్ధ వర్ణాత్మికామ్
గాయత్రీం వరదా భయాంకుశకశాశ్శుభ్రమ్
కపాలం గదామ్
శంఖం చక్రమధార విందం యుగళమ్
హసైర్వహం తీం భజే ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here