అహొబిలం-శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం

56

ఈ క్షేత్రం దట్టమైన నల్లమల అడవులలో ,కర్నూలు జిల్లా నంద్యాలకు 60 కి.మీ ,ఆళ్ళగడ్డకు 24 కి.మీ దూరంలోనూ వుంది. ఇది రెండు భాగాలు ఎగువ అహొబిలం,దిగువ అహొబిలం. దిగువ అహొబిలం నుండి ఎగువ అహొబిలం 8కి.మీ దూరం వుంటుంది.

క్షేత్ర మహత్యం–విష్ట్నుభక్తుడైన ప్రహ్లదుడిని అతని తండ్రి హిరణ్యకశిపుడు హరినామం పలుకవద్దని శాసిస్తాడు.నిశ్చల భక్తితో ప్రహ్లదుడు అన్ని భాధలు భరిస్తాడు కాని హరి నామం మాత్రం వదలడు. విసిగిన హిరణ్యకశిపుడు నీ హరి ఎక్కడున్నాడని దూషించగా మీ ఎదురన ఉన్న స్తంభంలొ హరి ఉన్నాడని ప్రహల్దుడు పలికినాడు.అంత కోపొద్రిక్తుడైన హిరణ్యకశిపుడు ఆ స్తంభం బ్రద్దలు కొట్టగా దాని నుండి శ్రీ నరసిం హస్వామి బయల్పడి హిరణ్యకశిపుడిని అంతమొందిచినాడు. ప్రహ్లదుడి తపస్సు వల్ల బిలంలో స్వామి స్వయంభువి గా వెలిసినాడు కనుక అహొబిలం గా ఈ క్షేత్రాన్ని పిలుస్తారు.

Hidden Secrets About The Ahobilam Nava Narasimha Temples

క్షేత్ర విశేషాలు–ఈ క్షేత్రం 108 దివ్య వైష్ణవ క్షేత్రాలలో ప్రముఖమైనది. దట్టమైన నల్లమల్ల అడవులలో నవ నారసి0హ క్షేత్రాలతో అలరాడే దివ్య ప్రదేశం.
అహొబిలం అడవిలో
1 జ్వాలా .2.అహొబిల 3.మాలోల 4.క్రోధ. 5.కారంజ 6.భార్గవ 7.యోగానంద 8.క్షాత్రవత 9.పావన నరసిం హులున్నారు.

ఇవి కాక ప్రహ్లదబడి అనే చిన్న గుహ. ఈ గుహ కెదురుగా కొండపై నుండి నీరు పడుతూ చాలా ఆహ్లదంగా వుంటుంది.

ఉగ్ర స్తంభం– హిరణ్య కశిపుడిని సంహరించడానికి స్వామి
ఏ స్తంభం నుండి వచ్చాడో అది ఉగ్ర స్తంభం.ఎగువ అహొబిలానికి 8 కి.మీ పైన చిక్కని అడవి లో వుంటుంది.చేరడం చాలా కష్టం .దైవ భక్తి,శారీరక శక్తి రెండూ కావాలి. ఉగ్ర స్తంభం పైన కాషాయు జెండా,స్వామి పాదముద్రలు ఉంటాయు.

Hidden Secrets About The Ahobilam Nava Narasimha Temples

రక్తమడుగు– జ్వాలా నరసిం హస్వామి దేవాలయం దారిలో పెద్ద జలపాతం ఉంటుంది.జలపాతం మధ్యలో రక్తమడుగు అనే చిన్న మడుగు వుంది.హిరణ్యకశిపుడి ప్రేగులు చీల్చి చంపిన పిమ్మట, నరసిం హస్వామి రక్తంతో తడిసిన తన చేతులను కడిగిన మడుగు అది.

అడవి లో నడుస్తుంటే ప్రక్కనే హెలికాప్టర్ వెళుతున్నట్లనిపించింది.కానీ అది జలపాతాల హొరు. 9 ఆలయాలను అడవి లో నడిచి దర్శించటం సాహసంతో కూడిన ఒక దివ్యానుభూతి.ప్రక్రృతి రమణీయత,పెద్దపెద్ద పర్వతాలు.గుహలు,అనేక చిన్నా చితక జలపాతాలు,వాగులు ఒకటేమిటి నల్లమల్ల అందాలన్నీ ఎగువ అహొబిలంలో కనువిందు చేస్తాయు. దిగువ ఆహొబిలం- పురాతన కట్టడాలతో చాలా అద్బుతంగా ఉంటుంది.

రూట్–ఆళ్ళగడ్డ నుండి 24 కి.మీ.పైకి బస్ లు.ఆటోలు వుంటాయు.
అకామిడేషన్- దొరుకుతుంది. ఆళ్ళగడ్డ,నంద్యాల లో హొటల్స్ కలవు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here