నదుల ప్రాశస్త్యము పార్ట్ -1

40
Know about religious significance of rivers in India

భారతదేశం ఎన్నో పుణ్యనదులు, తీర్ధాలకు నిలయం. ఇవన్నీ భక్తి శ్రద్ధలతో, విశ్వాసంతో స్నానమాచరిస్తే అనంత పుణ్యాన్ని, అత్మతత్వాన్ని ప్రసాదింపజేసి పునర్జన్మరాహిత్యాన్ని కలిగిస్తాయి. భారతదేశం ఖండాంతరాల్లో పెరుగాదించడానికి మూలకారణం ఈ దేశం యొక్క నగ-నన-నదీ-తీర్థ కలయికతో గూడిన ప్రకృతి. ఋగ్వేదంలో నదుల మహిమల గురించి ఇలా చెప్పారు. “గంగానదీ తీరమున దానం చేయటంవల్ల మానవుడు పరితాత్ముడౌతాడు. సరస్వతీ మొదలగు ప్రఖ్యాతాలైన పుణ్యనదీతీరముల యందు యజ్ఞాది వైదికకర్మలను ఆచరించుట చాలా మంచిది. సరస్వతీనది శ్రేష్ఠమైన తల్లిగా సంబోధింపబడింది”.

Know about religious significance of rivers in India

నదిలో కొన్ని పవిత్ర స్థలాలున్నాయి. తైత్తిరీయ సంహిత ఇలా చెప్పింది – తీర్థే, స్నాయి తీర్థమేవ సమానానాంభవతి

నదులన్నీ దైవతాలుగా ప్రస్తావింపబడ్డాయి. సరస్వతీ నది సర్వోత్తమమైన నదీదేవత. మన దైనందినజీవితంలో శ్రౌత, స్మార్తాది కర్మలలోని కలశారాధనలో నదులపేర్లను ఈ విధంగా స్మరిస్తాం.

గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి,

నర్మదే సింధు కావేరి, జలే స్మిన్ సన్నిధం కురు ||

“దివ్యములైన ఈ జలాలు మంగళకరాలైన మా అభీష్టమును తీర్చుగాక! మాకు త్రాగుటకు అనువైన నీటిని ఇచ్చుగాక! మావైపు ప్రవహించు గాక!” ఇవి జలవైశిష్ట్యాన్ని సంపూర్ణంగా అర్థంచేసుకున్న వేదఋషులు త్రికరణశుద్ధిగా జలదేవతను ప్రార్థించిన మంత్రం యొక్క భావం.

Know about religious significance of rivers in India

ఇంటిలో స్నానం చేస్తున్నా కూడా “గంగేచ యమునే కృష్ణేగోదావరి సరస్వతి” అంటూ ఆ నదులను స్మరిస్తూ చేసే స్నానం వల్ల వచ్చే ఫలాలను అర్షులు ఇలా చెప్పారు.

నదీస్నానం చేస్తే శారీరకంగా కనబడే మాలిన్యం పోతుంది. నిండు ప్రవాహమున్ననదిలో స్నానం చేయడంవల్ల శరీర మంతటికీ సుఖస్పర్శ కలిగి శరీరంలో ఉష్ణాధిక్యత తగ్గుతుంది. నడీనీటిలోని చల్లదనం ఇంద్రియతాపాలను తగ్గించి మనస్సుకూ, వాక్కుకూ శుచిత్వాన్ని కలిగిస్తుంది. కర్మానుష్ఠాన యోగ్యత సిద్ధిస్తుంది. పుణ్యనదీతీర్థాల్లో చేసే స్నానం మనసుకు ఏకాగ్రతనిస్తుంది.
తీర్థమందు స్నానం చేసినవాడు తనకు సంబంధించిన వారిలో చాలా శ్రేష్ఠమైన వాడవుతాడు. మహర్షుల యొక్క దీక్షా, తపస్సుల విశేషాలు, శక్తి నదీ జలాల్లో ఉన్నవని వేదం నిర్దేశించింది. కావున నదీస్నానంచే వాటిని మనము స్వీకరించి పవిత్రులమౌతాం.
అందుచేతే నదీజల స్నానం సర్వథా, సర్వదా యోగ్యమని అర్షుల వాక్కు.

భారతదేశంలో పుణ్యనదులకు కొరతేలేదు. పుట్టింది మొదలు మానవులు చేసే పాపాలు విశిష్టదినాల్లో అనగా – పుష్కర సమయంలో, గ్రహణ సమయాల్లోను, మకర సంక్రమణ సమయంలో, కార్తీక, మాఘమాసాల్లో నదీ స్నాన మాచారిస్తే త్రికరణశుద్ధిగా పాపాలు నశిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. గంగానదీ స్నానం అరవైయోజనాల పవిత్ర ప్రదేశం. అరవై పాపాలు హరించే పుణ్యమూర్తి. గంగాద్వారా స్నానఫలం దీనికి రెట్టింపు. యమునానదీ తీరం ఇరువది యోజనాలు విస్తరించి, ఇరవై రకాల పాపాలు పరిహరిస్తుంది.

Know about religious significance of rivers in India
సరస్వతి అంతర్వాహినిగా ప్రవహించి ఇరవైనాలుగు యోజనాలు విస్తరించిన ఈ నది ఇరవై పాపాలు పోగొడుతుంది.
వరుణ, కుశావర్త; శతద్రువు; విపాశక; శరావతి; వితస్త; ఆశిక్ని; మధుమతి; ఘ్రుతవతి; మొదలిఅన నదీతీరాల్ సందర్శనం శుభప్రదం. దేవనడిగా ప్రఖ్యాతమైన ఆ నదీ పరీవాహక ప్రాంతం పదియోజనాలు విస్తరించి; పదిహేను రకాల పాపాలను పోగొడుతుంది. రేవానదీ స్నానం బ్రహ్మ హత్యాపాతకాన్ని నాశనం చేస్తుంది. చంద్రభాగ, రేవతి, సరయు, గోమతి, కౌశిక, మందాకినీ, సహస్త్రవక్ర్త, పూర్ణ, పుణ్య, బాహుదాలనే నదులు పదహారు యోజనాలు విస్తరించాయి. నదీ సంగమ ప్రదేశాల్లో చేసే స్నానం, సంధ్యాదికాలు అనంత పుణ్యఫలాలనిస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here