నదుల ప్రాశస్త్యము పార్ట్ -2

39

గోదావరీతీరం ఆరు యోజనాలు విస్తరించి ఉంది. ఒక్కసారి గోదావరి తీరం చుట్టి వచ్చినవారికి “వాజపేయ” యాగ ఫలం లభిస్తుంది. భీమేశ్వరం, వంజర సంగమస్థానాలు ప్రయాగాతో సమానం. ద్వాదశ యోజనాలు విస్తరించిన కుశస్థలీనది ముప్ఫై ఆరు పాపాలను, పూర్ణానది యాత్ర ముప్ఫై పాపాలను, కృష్ణవేణి పదిహేను పాపాలను, తుంగభద్ర ఇరవైపాపాలను ప్రక్షాలనం చేస్తాయి. పంపాసరోవర శక్తి అనంతం. పాండురంగా మాతులింగ, గంధర్వ నగరాలు తీర్థాలతో విలసిల్లుతున్నాయి. రామేశ్వరంలో 108 తీర్థాలు, ఆదివరాహక్షేత్రమైన తిరుమలలో దాదాపు 18 తీర్థాలు ఉన్నాయి. ఈ తీర్థాలలో స్నానమాచరిస్తే పాపాలు తొలగి పుణ్యఫలం కలుగుతుంది.

Know about religious significance of rivers in India
మహానది, తామ్రపర్ణి నదుల పుణ్యం వర్ణశక్యముకాదు. కుంభకోణంలో స్నానం సమస్త తీర్థాల సమానం.
కొన్ని సమయాల్లో నదులు, తీర్థాలలో స్నానమాచరించటం నిషేధించటం జరిగింది. రవి కర్కాటకంలో ఉన్న సంక్రమణ సమయం రెండుమాసాలు నదీ రజస్వల సమయం. ఆ సమయంలో నదీస్నానం దోషం. నదీ తీరప్రాంత వాసులకు ఈ దోషముండదు. నదీ రజస్వల అంటే, కొత్తనీరు రావటమన్న మాట. అప్పుడు స్నానం చేయడం, మహాదోషం. తీర్థసేవన విషయంలో ఇది సాధారణ విషయమైనా, ఈ సమయంలో తీర్థ దర్శనం చేయవలసివస్తే స్నాన, క్షౌర, ఉపవాసాదులు ఆచరించాలి. కాబట్టి “జాగ్రత్త” అని హెచ్చరించారు. ప్రతి నదీ పాపహారిణే, పుణ్యమూర్తే. నది స్త్రీ రూపం. అందుకే స్త్రీలు పసుపు, కుంకుమ, పువ్వులతో విశేషంగా నదిని పూజిస్తారు.

Know about religious significance of rivers in India

ప్రతి జీవనడికి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. జీవన ప్రదాతలైన నదులకు కృతజ్ఞత చెప్పటం పుష్కరాల ప్రధానోద్దేశం. పెద్దలకు పిండ ప్రదానం చేసి పితృఋణం తీర్చుకోవటం ఒక ధార్మిక, సాంస్కృతిక ప్రయోజనం. మేషం మొదలైన పన్నెండు రాశులలో బృహస్పతి ఒక్కొక్క రాశిలో ఒక్కో సంవత్సరం ఉంటాడు. బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినపుడు గోదావరి నది పుష్కరాలు వస్తాయి. అలాగే కన్యారాశిలో బృహస్పతి ప్రవేశించినపుడు కృష్ణానదికీ పుష్కరాలు వస్తాయి. పుష్కరాల సమయంలో నదీస్నానం చేస్తే వెయ్యి గోదానాలు చేసిన పుణ్యం లభిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here