ఆది శంకరాచార్యులు యొక్క ప్రాముఖ్యత తెలుసుకోండి

30
Meaning of adi shankaracharya stotras

సనాతనధర్మ ప్రచారానికి ఆది శంకరాచార్యులు చేసిన సేవ ఇంతాఅంతా అని చెప్పగలిగింది కాదు. ఆ ధీశాలి తన ముప్ఫయి రెండేళ్ళ జీవితకాలంలో ప్రతి నిముషమూ హిందువుల ఆధ్యాత్మక ప్రగతికోసం బహుముఖమైన కృషి చేయటం లోనే వెచ్చించారు. వైదికమతాన్ని గౌరవించే వారందరూ ఆయనను ప్రతిరోజూ స్మరించుకోవాల్సిందే. ముఖ్యంగా వైశాఖశుద్ధ పంచమినాడు, ఆది శంకరుల జయంతి సందర్బంగా విస్తృతమైన ఆయన భోధనలలో కొన్నింటినైనా యథాశక్తి గుర్తుచేసుకోవాలి.

Meaning of adi shankaracharya stotras

ఆచార్యులవారి బొదల సారాంశం ఏమిటి?

జంతువులన్నింటిలో మానవజన్మ ఉత్కృష్టం, దుర్లభం, మానవ జన్మనెత్తిన వాళ్ళు ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలు పొందేందుకు యత్నిస్తారు. చరమలక్ష్యం మాత్రం మోక్షసాధన.

మోక్షమంటే బంధ విముక్తి. జీవుడు గురుబోదల ద్వారా, ఉపనిషద్వాని ద్వారా, అన్నింటికీ మించి తన సొంతసాధన ద్వారా ప్రయత్నిస్తే, తన స్వస్వరూప జ్ఞానం కలిగి, బంధమోక్షం లభిస్తుంది.

జీవాత్మ – పరమాత్మ ఒక్కటే నిత్యం, సత్యమూ, శుద్ధమూ, ముక్తమూ, అనాదీ, అనంతమూ అయిన సత్-చిత్-ఆనంద పరబ్రహ్మమనే అఖండ చైతన్యము, కేవల జడపదార్థంకాని ప్రతి వస్తువు (ప్రాణి) లోనూ జీవాత్మగా ప్రకాశిస్తున్నది. సత్తూ – చిత్తూ ఆనందం తప్ప, ఆ ఆత్మకు మరొక లక్షణం లేదు. ఈ పరబ్రహ్మ ఒక్కటే నిత్యసత్యం. మిగతా దృశ్య – శ్రవ్య జగత్తంతా మిథ్య. బ్రహ్మ సత్యం, జగత్ – మిథ్య.

Meaning of adi shankaracharya stotras

‘మిథ్య’ అన్న మాటను అపార్థం చేసుకోనక్కరలేదు. జగత్తు మిథ్య అంటే, జగత్తు లేదని కాదు. ఉన్నది కానీ, నీకు కనిపిస్తున్నరూపంలో లేదు. చీకటిలో తాడు, పాముగా కనిపిస్తున్నదంటే, అక్కడ తాడు అనే సత్యం ఉంది. అది చీకటివల్ల పాము అనే రూపంలో కనిపిస్తున్నది. పాము మిథ్య. అలాగే సచ్చిదానంద పరబ్రహ్మమైన అఖందచైతన్యం ఆదీ, అంతంలేని నిత్య సత్యం. కానీ ఆవిద్య స్వస్వరూప జ్ఞానాన్ని కప్పివేసే మాయ వల్ల ఆ అభిన్న చైతన్యం, చిత్ర చిత్రాలుగా విభిన్న నామరూపాలుగా ఏర్పడి ఉన్నట్టు కనిపిస్తున్నది. ఈ కనిపించేది ఒక కనికట్టు. నిజమైన ఆత్మజ్ఞానం కలిగినవాడికి ఇదంతా మిథ్యఅనీ, అభిన్నమూ, శాశ్వతమూ, పరమార్థమూ అయిన పరబ్రహ్మ స్వరూపం మాత్రమే సత్యమూ అన్న ఎరుక కలుగుతుంది.

ఆ ఎరుకే మోక్షం.

అయితే ఈ ఎరుక, కేవలం పుస్తకం చదివి, ప్రవచనం వినీ, పరోక్షంగా గ్రహించి, సంపాదించగలిగింది కాదు. పుస్తకమూ, ప్రవచనమూ మోక్షసాధన గురించి ‘సమాచారం’ ఇచ్చి, మార్గదర్శనం లభిస్తుంది గానీ, గమ్యం చిక్కదు. పై పెచ్చు దానివల్ల అహంభావం మరింత పెరిగి, మోక్షం మరింతగా దుర్లభం అయ్యే ప్రమాదం ఉంది. శుష్క పాండిత్యం వల్ల ఎక్కడయినా ప్రవచనాలు చేసీ, చర్చలు జరిపి భుక్తి సంపాదించుకోవచ్చు, ముక్తి మాత్రం సంపాదించలేవు అని శంకరాచార్యులు స్వయంగా, ఖండితంగా చెప్పారు.

Meaning of adi shankaracharya stotras

మరి, మోక్షం సాధించేదెలా? జీవ-జగత్-ఈశ్వరుల ఏకత్వాన్ని అపరోక్షంగా, స్వయంగా అనుభవంలోకి తెచ్చుకొంటేనే మోక్షం. అదెలా తెచ్చుకోవాలి? వైరాగ్యంతో, తీవ్రమయిన మోక్ష-ఇచ్ఛతో, శమదమాలతో, నిరంతర ఆత్మా-అనాత్మ విషయాల వివేచనతో సాధన చేసేవాడు. సద్గురువు కృపవల్ల, ఉపనిషత్సత్యాల శ్రవణ-మనన-ధ్యాన-నిధి ధ్యాసనలు చేస్తే బహుకాలం సాధన తర్వాత ఆత్మజ్ఞానాన్ని అపరోక్షంగా అనుభావరూపంగా పొంది, ముక్తి సాధించగలడు. మోక్షం ఇంట దుర్లభమూ దుస్సాధ్యమూ అయితే ముక్తులు కాలేని సామాన్య మానవులందరూ ఏం చేసేట్టు? మొదటిమెట్టుగా భగవంతుడిని ప్రార్థించమన్నారు ఆది శంకరులు. భక్తి వల్ల ముక్తి రాదు గానీ, మోక్షసాధనకు కావలసిన సాధన సామాగ్రి (వైరాగ్యం, మోక్ష ఇచ్ఛ, ఆత్మా-అనాత్మ వివేచనా, శమ దమాది గుణాలూ) సమకూరవచ్చు. తద్వారా మోక్షసాధనకు మార్గం సుకరం అవుతుంది. ఆదిశంకరులు శతాధికంగా భగవత్ స్తోత్రాలు రచించారు.

వీటిలో ‘షట్పదీస్తోత్రం’ అనే చిన్న స్తోత్రం ఒకటి. దీనిలో సాధకుడు విష్ణువును ఏమి కోరుతూ ప్రార్థించాలో సూచించారు. ఈ శ్లోకంలో ఆర్ ఆరు చిన్న శ్లోకాలు (ఏడో శ్లోకం ముక్తాయింపు) ఉన్నాయి.

ఆరు కాళ్ళు ఉండే తుమ్మేదను షట్పదీ అంటారు. ఆరుశ్లోకాలున్న ఈ స్తోత్రాన్ని షట్పదీ స్తోత్రం అని అంటారు.

అవినయం అపనయ, విష్ణో!

దమయ మన:, శమయ విషయ మృగ తృష్ణామ్,

భూత దయం విస్తారయ,

తారయ సంసార సాగరత: ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here