లక్ష్మీదేవి దివ్య శక్తులు

30
Mother goddess Lakshmi divya shakthi

లక్ష్మీ దేవి గురించి వివిధ కథలు పురాణాలలోను, ఇతిహాసాలలోను ఉన్నాయి. శ్రీ మహా విష్ణువునకు సృష్ట్యాది నుండి లక్ష్మీదేవి తోడుగానే ఉందని, ఆమె ‘నిత్యానపాయిని’ లక్ష్మీనారాయణులు వేరు వేరు కాదని శ్రీవైష్ణవ సంప్రదాయంలో చెప్పారు. సృష్ట్యాదిలో దేవి (మహాశక్తి) సృష్టిని పాలించడానికి విష్ణువుకు తోడుగా ఉండమని లక్ష్మీదేవిని ప్రసాదించిందని దేవీ భాగవతం లో చెప్పారు. ఒకసారి లక్ష్మీదేవి విష్ణువు నుండి వేరు కావడం వలన విష్ణువు శక్తి హీనుడయ్యాడు. అప్పుడు బ్రహ్మ ఆనతిపై భృగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మి, భృగువు, ఖ్యాతిల కుమార్తెగా జన్మించింది. ఆమెను భృగువు విష్ణువుకు ఇచ్చి పెండ్లి చేశాడు. కనుక లక్ష్మీదేవిని ‘భార్గవి’ అని కూడా అంటారు.

Mother goddess Lakshmi divya shakthi

తరువాత ఒకసారి దూర్వాసుని శాపకారణంగా లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదలి పాలసముద్రంలో నివసించింది. అమృతం పొందాలని దేవతలు, రాక్షసులు పాలసముద్రాన్ని మందర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకిని కవ్వపు త్రాటిగా చేసే చిలకడం ప్రారంభించారు. ఆ సమయంలో పాలసముద్రం నుండి కామదేనువు, ఐరావతం, కల్పవృక్షం మొదలైన వాటితో లక్ష్మీదేవి అవతరించింది. పాలసముద్రంలో నుండి పుట్టింది కనుక ఆమె ‘సముద్రరాజ కుమార్తి’ అయ్యింది. ఆమెతో పాటే జన్మించిన చంద్రుడు లక్ష్మీకి సోదరుడయ్యాడు. ధనాధి దేవత అయిన ఈ దేవిని శ్రీమహావిష్ణువు భార్యగా చేసుకున్నాడు.విష్ణువు శక్తికి, మాయకు కారణం లక్ష్మీదేవి తోడుండడమే అంటారు. భూదేవి కూడా లక్ష్మీకి మరో అంశ అని చెబుతారు. దేవీ మహాత్మ్యంలో మహాశక్తియే మహాలక్ష్మీగా చెప్పబడింది.ఆమెను అష్ట భుజ మహాలక్ష్మీగా వర్ణించారు. విష్ణువు అవతారాలతో పాటు లక్ష్మీదేవి కూడా అవతరిస్తుందని చెప్పారు. రామావతారం లో సీతగా, కృష్ణావతారంలో రుక్మిణిగా, కలియుగంలో వెంకటేశ్వర స్వామికి అలవేలు మంగగా, విష్ణువుకు లక్ష్మీదేవిగా తోడై ఉంటుంది.

Mother goddess Lakshmi divya shakthi


లక్ష్మీదేవికి వివిధ పేర్లు
చాలా మంది దేవతలులాగే లక్ష్మీదేవికి ఎన్నో పేర్లు ఉన్నాయి. అష్టోత్తర శతనామ స్తోత్రం , సహస్ర నామ స్తోత్రం వంటివి ఉన్నాయి. ఎక్కుగా లక్ష్మీదేవిని పలికే పేర్లలో కొన్ని లక్ష్మీ, శ్రీ, సిరి, భార్గవి, మాత, పలుకు తేనెల తల్లి, నిత్యానపాయిని, క్షీర సముద్ర రాజ తనయ, పద్మ, పద్మాక్షి, పద్మాసన, కమల, పద్మప్రియ, రమ, ఇందిర.

Mother goddess Lakshmi divya shakthi

లక్ష్మీదేవి రూపధారణ
ఎక్కువగా లక్ష్మీదేవిని చతుర్భుజాలతోను, ధన కుంభంతోను, పద్మాసనగా, పద్మాలను చేతబట్టి, సకలాభరణ భూషితయైనట్లుగా చిత్రించబడుతుంది. లక్ష్మీ దేవి వాహనం గుడ్లగూబ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here