శ్రీ లక్ష్మీతిరుపతమ్మ చరిత (పార్ట్ – 1)

55
Penuganchiprolu Sri Tirupatamma temple history details

భక్తులపాలిట కొంగు బంగారమైన చల్లని తల్లి మన శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారు

Penuganchiprolu Sri Tirupatamma temple history details

ఒకపురాతన నగరము మున్నానది గా పిలువ బడే మునేటి ఒడ్డున విలసిల్లిన బృహత్కాంచీపురమే ఈ పెనుగంచిప్రోలు. 11వ శతాబ్దంలో గుడిమెట్ట ను పాలించిన చాగి వంశీయులకు రెండవరాజథాని గా పేరొందిన నగరమిది . వీరు రెండు శతాబ్దాల కాలం కాకతీయరాజులకు విథేయులుగా ఉంటూనే స్వతంత్ర ప్రతిపత్తి గల మాండలిక రాజ్యంగానే కొనసాగినట్లు చరిత్ర చెపుతోంది. ఇచ్చట నూటొక్క దేవాలయాలున్నట్లు అవన్నీ కాలక్రమేణా కాలగర్భంలో కలిసిపోయినట్లు స్ధానికులు చెపుతుంటారు.

Penuganchiprolu Sri Tirupatamma temple history details“ అచట పుట్టిన చిగురు కొమ్మైన చేవ “ అంటాడు అల్లసాని పెద్దన. అలాగే ఈ పెనుగంచిప్రోలు లో ఎక్కడ తవ్వినా శిధిలశిల్పాలు కళాఖండాలే లభిస్తాయి. ఎక్కడ ఇంటికి పునాదులు తీస్తున్నా, ఎక్కడ కొత్త నిర్మాణానికి గోతులు తవ్వుతున్నా ఏదో ఒక పురాతన అవశేషాలు బయట పడుతూనే ఉంటాయి. ఒక ప్రదేశానికి అంత మహత్తు కలగటం ఆ స్థలమహత్యమని పెద్దలు చెపుతారు . అటువంటి పవిత్ర ప్రదేశంలో తిరుపతమ్మ తల్లి పేరంటాలై కొలువు తీరింది. కొలిచిన భక్తులకు కొంగుబంగారమై, కోర్కెల తీర్చెడి కల్పవల్లి శ్రీ తిరుపతమ్మ తల్లి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here