శ్రీవేంకటేశ్వర స్వామి వారిని అలంకరించే పద్దతి

55
Thirimula Thirupathi Sri Venkateswara Swamy Alankarana

శ్రీవేంకటేశ్వరునికి అలంకరించే పూలమాలలు కూడా ఒక క్రమ పద్ధతిలో ప్రత్యేకంగా ఉంటాయి. శ్రీవారి మూలమూర్తికి రోజూ అలంకరించే దండలివీ…

Thirimula Thirupathi Sri Venkateswara Swamy Alankarana

* శిఖామణి: కిరీటంపై నుంచి రెండు భుజాల వరకు అలంకరించే ఒకే ఒక దండ. ఇది 8 మూరలు ఉంటుంది.

* సాలిగ్రామ మాలలు: శ్రీవారి భుజాల నుంచి ఇరువైపులా పాదాల వరకు వేలాడుతూ ఉంటాయి. ఇవి రెండు పొడవైన మాలలు. ఒక్కోటి నాలుగు మూరలు ఉంటుంది.

* కంఠసరి: మెడలో రెండు పొరలుగా రెండు భుజాల మీదకు అలంకరించి ఉండే దండ. ఒక్కోటి మూడున్నర మూరలు ఉంటుంది.

* వక్ష స్థల లక్ష్మీ: శ్రీవారి వక్ష స్థలంలో ఉన్న శ్రీదేవి, భూదేవులకు రెండు దండలు. ఒక్కోటి ఒకటిన్నర మూరలు.

* శంఖు చక్రం: శంఖుచక్రాలకు రెండు దండలు. ఒక్కోటి ఒక్కో మూర.

* కఠారి సరం: స్వామివారి బొడ్డున ఉన్న నందక ఖడ్గానికి అలంకరించే దండ. రెండు మూరలు ఉంటుంది.

* తావళములు: రెండు మోచేతుల కింద మూడు మూరలు, నడుము నుంచి మోకాళ్లపై హారాలుగా మూడున్నర మూరల చొప్పున, మోకాళ్ల నుంచి పాదాల వరకు జీరాడుతూ నాలుగు మూరల పూల హారాలను అలంకరిస్తారు.

* తిరువడి దండలు: స్వామివారి పాదాలపై చుట్టూ అలంకరించే రెండు దండలు. ఒక్కోటి ఒక్కో మూర.

* ప్రతి గురువారం సాయంత్రం జరిగే పూలంగి సేవలో మాత్రమే స్వామి వారి మూలమూర్తికి ఆభరణాలన్నీ తీసేసి స్వామి వారిని నిలువెల్లా పూల మాలలతో అలంకరిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here