గోన బుద్ద రెడ్డి స్టోరీ ( భువనగిరి)

46
Gona Budda Reddy biography
వుండేది. అద్వైతమతము నవలంబించిన గోన వంశస్తుడు బుద్ధారెడ్డి-1 పశ్చిమచాళుక్య రాజులకు సామంతప్రభువుగా భువనగిరి దుర్గమునుంచి పాలించేవాడు. బౌద్ధమతం నచ్చి, దానిని స్వీకరించి బౌద్ధుడైనాడు. ఇతని కొడుకు క్షేమరాజు వైష్ణవుడు. రంగరాజు అనే నామాంతరాన్ని ధరించినవాడు. అతనికిద్దరు కొడుకులు. పెద్దకొడుకు పేరు తన తండ్రిపేరు బుద్ధారెడ్డి అని, చిన్నకొడుకు పేరు లకుమయారెడ్డి అని పెట్టుకున్నాడు.
Gona Budda Reddy biography
హనుమకొండవిషయాన్ని కళ్యాణీ చాళుక్యుల సామంతుడుగా రుద్రదేవుడు పాలిస్తున్నసమయంలో ముచికుందసీమకు రాజధానిగా భువనగిరి వుండేది. కళ్యాణి దుర్గాధిపతిగా వున్న తైలపుణ్ణి ఓడించడంలో రుద్రదేవునికి బుద్ధారెడ్డి సాయపడ్డాడు. భువనగిరికి 150 కి.మీ.ల దూరంలో నాగర్ కర్నూలు జిల్లా కేంద్రానికి దగ్గరలో వుంటుంది వర్థమానపురం(వడ్డెమాను). అది రాజధానిగా తెలుగుచోడరాజులు ‘మానువకోట’ విషయాన్ని పాలిస్తుండేవారు. రుద్రదేవునికి సమకాలికుడైన భీమచోడుడు చాళుక్యచక్రవర్తి తైలపుని సామంతునిగా వర్థమానపురాన్ని ఏలుతుండేవాడు. సవతితల్లినే చెరపట్టిన ఇతని దుర్మార్గంపై ఆమె కొడుకు చినగోకర్ణుడు చక్రవర్తికి నివేదించిన సంగతి తెలిసిన భీమచోడుడు అన్నం తింటున్న వానిని చంపించాడు.
ఇది తెలిసిన బుద్ధరాజు భీమచోడున్ని శిక్షించడానికి రుద్రదేవుని సాయమడిగాడు. బుద్ధదేవుని దండయాత్ర , రుద్రదేవుని సహాయం తెలిసిన భీమచోడుడు పారిపోయాడు. బుద్ధారెడ్డి వర్ధమానపురాన్ని ఆక్రమించాడు. రుద్రదేవుడు భీమచోడుని పట్టుకుని శిక్షించి, అతని కుమార్తె పద్మావతిని పెండ్లాడినాడు. ఇరవైదేండ్ల బుద్ధారెడ్డి-2ని మానువనాటి విషయానికి రాజప్రతినిదిగా చేసినాడు. రంగనాధరామాయణము రాసిన గోనబుద్ధారెడ్డి -2 డెబ్బైయేండ్లు దాటిన తరువాత మరణించాడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here