చిన్నారి అభిమాని కోరికను నెరవేర్చిన పవన్ !

49
JanaSena Party Chief @PawanKalyan met Revathi

ప్రజా సమస్యలను తెలుసుకునే పనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో పర్యటించిన సినీ హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ చిన్నారి అభిమాని కోరికను నెరవేర్చారు. వివరాల్లోకి వెళితే 6 ఏళ్ల వయసున్న చిన్నారి రేవతి గత కోనేళ్ళుగా మస్క్యూలర్ డిస్ట్రోఫీ అనే వ్యాధితో భాధపడుతోంది. ఎప్పటికైనా తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ ను కలవాలనేది ఆ చిన్నారి కోరిక.

ఈ విషయాన్ని అనుచరుల ద్వారా తెలుసుకున్న పవన్ వెంటనే పాప ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. కొద్దిసేపు పాపను తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని సరదాగా మాట్లాడారు. పాపకు బ్యాటరీతో నడిచే వీల్ చైర్ అవసరమని డాక్టర్లు సూచించడంతో ఆ వీల్ చైర్ ను ఏర్పాటు చేస్తానని, అలాగే వైద్యానికి అవసరమయ్యే ఆర్ధిక సహాయాన్ని కూడ అందిస్తానని హామీ ఇచ్చారు. ఇలా పవన్ స్వయంగా వచ్చి కలవడం, సహాయం అందిస్తానని మాటివ్వవడంతో రేవతి, ఆమె తల్లి సంతోషం వ్యక్తం చేసి పవన్ కు కృతజ్ఞతలు తెలిపారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here