మరోసారి తన పెద్దమనసు చాటుకున్న విజయ్

51
Actor Vijay visits Thoothukudi victims' houses & distributes one lakh to each family

ఎవరికైనా సాయం చేయాలంటే ఎప్పుడూ ముందుండే తమిళ హీరో ‘ఇలయదళపతి విజయ్’. అయితే ఆయన ఎప్పడు ఎవరికి సాయం చేసిన ఆ విషయం చాలా గోప్యంగా ఉంచాలని భావిస్తాడు. అయితే తాజాగా విజయ్ చేసిన సాయం గురించి మాత్రం ఆయన బయటకు చెప్పకపోయిన బయటకు వచ్చి ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Actor Vijay visits Thoothukudi  victims' houses, distributes one lakh as compensation to each family

ఇటీవల తమిళనాడులోని తూత్తుకుడి కాల్పుల్లో 13మంది చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే వారి కుటుంబాలను ఆదుకునేందుకు సీక్రెట్‌గా వెళ్లి మరణించిన 13 మంది మృతుల కుటుంబాలను పిరామర్శించి ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున అందజేశారు. పగటిపూట వస్తే పోలీసులు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తారని భావించే తాను ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ఒంటరిగా ఆయన వెళ్ళినట్లు తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here