2 కోట్ల 76 లక్షలతో అప్పట్లో ప్రకాశం బ్యారేజి నిర్మించారు : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

27
AP CM Chandrababu Naidu releases water from Prakasam Barrage to Krishna delta

కృష్ణానదిపై ఆల్మట్టి, డ్యూరాల ప్రజెక్టులతో పాటు ఇతర ప్రాజెక్టులు వచ్చాయి. పోలవరం ప్రాజెక్ట్ మరో ఏడాది లో పూర్తవుతోంది. గోదావరి, కృష్ణానదిలను కలిపిన చరిత్ర‌ మనదే. ఎక్కడా ఇబ్బంది లేకుండా‌ పంటలు కాపాడాం, క్రుష్ణా మోడరైజేషన్‌లో ఆధునీకీకరణతో ముందుకు వెల్తున్నాం. వైకుంఠ బ్యారేజికి త్వరలోనే టెంటర్లు పిలుస్తున్నాం. గోదావరి పెన్నా, కృష్ణా మూడు నదుల అనుసంధానం జరుగుతోంది. నదుల అనుసంధానం ద్వారా సముద్రంలోకి నిరు పోకుండా ఆపుతున్నాం, అన్ని చెరువులను గొలుసు గట్టు చెరువులుగా చేసి భూగర్భజలాలను పెంచుతున్నాం. భవిష్యత్తులో త్రాగునీటి సమస్య తలెత్తకుండ చర్యలు తీసుకున్నాం.

AP CM Chandrababu Naidu releases water from Prakasam Barrage to Krishna delta

కొంతమంది అభివ్రుద్ధి లేదని మాట్లాడుతున్నారు, పట్టిసీమ ప్రాజెక్ట్ కు అడుగడుగునా అడ్డం పడ్డారు. నీళ్ళొస్తే కూడా వైసిపి నేతలు ఓర్వలేకపొతున్నారు. మంచి ని మంచిగా మాట్లాడాలి, ప్రజలు కూడా చెడు ను ఖండించాలి. రాష్ట్రంలో ఎక్కడా నీటి సమస్య లేదు. రాయలసీమ లో చెరువులకు నీల్ళిచ్చాం పొలాలు అన్నీ కళకళలాడుతున్నాయి. అభివృద్ధి చేస్తుంటే అడ్డపడ్డవాళ్ళతో ఫైట్ చేస్తున్నా. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆభివృద్ది చేసి తీరుతాం. దక్షిణ భారతం మొత్తం నీటి ఎద్దడి ఉంది. నీతి ఆయోగ్ లో మూడవ స్ధానం. ఇరిగేషన్‌లో మొదటి స్ధానం లభించింది. దేశంలోనే క్లీన్ సిటీ విజయవాడ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here