కత్తి మహేష్ ని టెర్రరిస్టులతో పోల్చిన జానారెడ్డి

26
Jana Reddy fires on Kathi Mahesh

గత రెండు మూడు రోజులుగా తెలుగు ఛానెల్స్ అన్నిటిలో కత్తి మహేష్ మాట్లాడిన తిరు, చేసిన అనుచిత వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందని తెలంగాణా కాంగ్రెస్ నేత జానారెడ్డి అన్నారు. ఈ రోజు అయన మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. టెర్రరిస్టుల కు,ఇలాంటి కత్తి మహేష్ లాంటి వారికి తేడాలేదు. అని అన్నారు. సమాజంలో భావద్వేషాలు రెచ్చగొట్టే విధానం, అహంకార పూరితంగా మాట్లాడం, సమాజంలో ఘర్షణలు రెగొట్టే విధానం సరికాదని ఆయన అన్నారు.

Jana Reddy fires on Kathi Mahesh

కత్తి మహేష్ పైన చట్టరీత్య కఠినమైన చర్యలు తీసుకోవాలి అని కోరారు. సమాజంలో అన్ని వర్గాలు అసహ్యించుకుంటున్నాయి. సమాజం ఈ వ్యాఖ్యలపై స్పందించాలి. లేకపోతే సమాజంలో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటాయి. ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని అన్నారు. ఇప్పటికే కత్తి మహేష్ చేసిన వాఖ్యాల ఫై పలువురు స్పందిస్తున్నారు. సామాన్యులు ఏ కాకుండా నిన్న మెగా బ్రదర్ నాగ బాబు కూడా ప్సందించిన విషయం తెలిసిందే. ఇంకా ఈ విషయం ఎక్కడి వరకు పాకుతుందో చూడాలి . ఇప్పటికే కత్తి మహేష్ ని అరెస్ట్ చేసి కొద్దిసేపు విచారించిన విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here