శ్రీవారిని దర్శించుకున్న కెన్యా ప్రధాని..!

20
Kenya Former Prime Minister Raila Odinga Visits Tirumala Sri Venkateshwara Temple

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని కెన్యా మాజీ ప్రధానమంత్రి “రైలా ఒడింగా” ఈ రోజు దర్శించుకున్నారు. రాత్రి తిరుమల కు చేరుకుని మంగళవారం ఉదయం వెంకటేశ్వరా స్వామి వారికి జరిగే నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకుని మ్రొక్కులు చెల్లించుకున్నారు. టిటిడి అధికారులు దగ్గరుండి దర్శనం ఏర్పాట్లు చేశారు. రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం తీర్ధ ప్రసాదాలు అందచేశారు అర్చకులు.

Kenya Former Prime Minister Raila Odinga Visits Tirumala Sri Venkateshwara Temple

ఆ తరువాత ఆలయం వెలుపల ఆయన  మాట్లాడుతూ స్వామి వారి దర్శనం కోసం తిరుమల తిరుపతి కి వచ్చాను అని తెలియచేసారు. అలాగే ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి ఆధ్యాత్మిక ప్రదేశాన్ని సందర్శించడం చాలా ఆనందంగా ఉంది అంటూ అన్నారు. తిరుమల కు రావడం తో హిందూ ధర్మం పై పూర్తి అవగాహన వచ్చిందని కెన్యా మాజీ ప్రధాని రైలా ఒడింగా తెలిపారు. సుందరమైన ప్రాంతంగా తిరుమలను వర్ణించారు ఓడింగా. ఆయనకు ఎలాంటి ఇబ్బంది కలుగ కుండ అక్కడి అధికారులు చూసుకున్నారు. దర్శనం అయిన వెంటనే అయన తిరిగి వెళ్ళిపోయారు. తిరుమల వెంకటేశ్వరుడి ఖ్యాతి దేశాలు దాటి వెళ్ళింది అని ఇలాంటి సంఘటనలు చుస్తే అర్ధం అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here