తెలంగాణ వైద్య చరిత్రలో ఒక మైలురాయి

56
KTR & Laxma Reddy Inaugurates Telangana Diagnostics Central Hub At Narayanaguda

నారాయణగూడలో ఐపీఎం క్యాంపస్ లో వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం తెలంగాణ డయాగ్ నోస్టిక్స్ సెంట్రల్ హబ్ ను మంత్రులు కేటీఆర్, లక్ష్మారెడ్డి ప్రారంభించారు. మంత్రులకు వైద్య పరికరాల గురించి డాక్టర్లు వివరించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను మంత్రులు తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కు వైద్యులు రక్త పరీక్షలు నిర్వహించారు. తెలంగాణ డయాగ్ నోస్టిక్స్లో ఉచితంగా 53 రకాల వైద్య పరీక్షలు చేయనున్నారు.

KTR & Laxma Reddy Inaugurates Telangana Diagnostics Central Hub At Narayanaguda

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు. వైద్య వ్యవస్థలో సీఎం కేసీఆర్ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 డయాలసిస్ సెంటర్లు ప్రారంభించామన్నారు… కేసీఆర్ కిట్ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య 40-50 శాతం పెరిగింది. పట్టణంలోని పేదవారి కోసం బస్తీ దవాఖానాలు ప్రారంభించామన్నారు.. ప్రస్తుతం 17 బస్తీ దవాఖానాలు నడుస్తున్నాయి. మనదేశంలో వైద్య వ్యవస్థ చాలా ఖర్చుతో కూడుకున్నది. సామాన్యులకు పైసా ఖర్చుకాకుండా తెలంగాణ డయాగ్ నోస్టిక్స్లో పరీక్షలు ఉచితంగా వైద్య పరీక్షలు చేసుకోవచ్చని కేటీఆర్ తెలిపారు.

తెలంగాణ వైద్య చరిత్రలో ఒక మైలురాయి అని మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేశాం. అన్ని జిల్లా కేంద్రాల్లో ఉచిత డయాగ్నోస్టిక్స్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతున్నారని చెప్పారు. గత ప్రభుత్వాలు వైద్య రంగాన్ని పట్టించుకోలేదని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here