తెలంగాణను నైరుతి ఒకరోజు ఆలస్యంగా పలకరించనుంది

29
Light rain in Hyderabad, Monsoon to make onset soon

తొలకరి పులకరింత కోసం ఎదురుచూస్తున్న తెలంగాణను నైరుతి ఒకరోజు ఆలస్యంగా పలకరించనుంది. కేరళలో మూడు రోజుల ముందుగానే ప్రవేశించినా,తెలంగాణకు మాత్రం మరో 24 గంటల తర్వాతే రుతుపవనాలు రానున్నాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాలకు నైరుతి వ్యాపించిందని, తెలంగాణలో మాత్రం జూన్‌ 6న అడుగుపెట్టనున్నాయని ఐఎండీ తెలిపింది. ఇవాళ రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు.. బుధ, గురువారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. కాగా, వాతావరణంలో వచ్చిన మార్పులతో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here