ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ కన్నుమూత…..

26

తెలంగాణ మరో కళాకారుడిని కోల్పోయింది. మిమిక్రీ లోకం మూగబోయింది. ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ ఈ రోజు కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వేణుమాధవ్ ఇక లేరన్న వార్త తెలుసుకున్న ఆయన సన్నిహితులుఅభిమానులుమిమిక్రీ కళాకారులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వేణుమాధవ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రముఖులు.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

Mimicry artist Nerella Venu Madhav passed away
డిసెంబర్ 28, 1932న వరంగల్ జిల్లాలోని మట్టెవాడలో శ్రీహరిశ్రీలక్ష్మీ దంపతులకు వేణుమాధవ్ జన్మించారు. 1947లో పదహారేళ్ల వయసులోనే మిమిక్రీ కళారంగంలో వేణుమాధవ్ ప్రవేశించారు. ఆ తర్వాత దేశవిదేశాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చారు. తెలుగుహిందీఇంగ్లీష్ఉర్దూతమిళంలో అనేక ప్రదర్శనలు ఇచ్చి అందరి మన్ననలు పొందారు. 2001లో నేరెళ్ల వేణుమాధవ్ పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. ఇయన మరణం తీరని లోటు ..నేరళ్ల వేణుమాధవ్ మృతి కి శాంతి చేకురాలి అని కోరుకుందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here