శ్రీశైలం డ్యాం ను సందర్శించిన మంత్రి దేవినేని ఉమా..

41
Minister Devineni Uma Maheswara Rao Visits Srisailam Reservoir

నవ్యాంధ్రలో నవనిర్మాణదీక్షలను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంబించిన మలి రోజు కర్నూలు జిల్లాలో ని జొన్నగిరి లొ ఏర్పాటు చేసిన సమావేశాలకు హజరయ్యేందుకు వెళుతున్న మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు శ్రీశైలం జలాశయాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా శ్రీశైలం జలాశయం లోని నీటి నిల్వలను డ్యామ్ అదికారులను అడిగి తెలుసుకున్నారు.

Minister Devineni Uma Maheswara Rao Visits Srisailam Reservoir

అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ … రాయలసీమను రతనాల సీమగా చూడాలనుకున్నదే ముఖ్యమంత్రి ద్యేయమని అది నేరవేరే సమయం దగ్గరలో ఉందని మంత్రి దేవినేని అన్నారు.రైతాంగాన్ని సుసంపన్నం చేసే దిశగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టామని, మన రాష్ట్రానికి గుండె కాయ లాంటి పోలవరం ప్రాజెక్టు పనులను ప్రతి క్షణం పర్యవేక్షిస్తున్నామన్నారు.రాబోయే వర్షాలను దృష్టిలో ఉంచుకుని అన్ని రిజర్వాయర్లలొ నిర్టీత టియంసిల నీటిని నిల్వ ఉంచేందుకు సర్వం సిద్దం చేశామని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here