ఆంధ్ర వచ్చేశాయి.. తెలంగాణకు వస్తున్నాయి..

27
Monsoon may reach Hyderabad between June 8 and 12

నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించనున్నాయి. రాయలసీమలోని అత్యధిక ప్రాంతాలు, కోస్తాలో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వరకు రుతుపవనాలు వ్యాపించాయి. మహారాష్ట్ర నుంచి కేరళ వరకూ తీరం వెంబడి ద్రోణి, మధ్య బంగాళాఖాతంలో ఆవర్తనం వేర్వేరుగా కొనసాగుతున్నాయి. దీంతో మరో 24 గంటల్లో తెలంగాణలోకి, రాయలసీమ, కర్ణాటకల్లోని మిగిలిన ప్రాంతాలకూ వ్యాపిస్తాయని భారత వాతావరణశాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గురువారం భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here