అందమైన మనసు … నారాయణమూర్తిగారే అతిగొప్ప హీరో!!!

18
NarayanaMurthy donates money to Orphange house

కొన్ని సంవత్సరాల క్రితం..హైదరాబాద్ జింఖానా మైదానంలో వరద బాధితులకోసం ఒక ప్రఖ్యాత క్రికెటర్ ఇచ్చిన “బ్యాట్ “వేలం జరుగుతుంది.. సినీపరిశ్రమలోని మహామహులంతా ఆ వేలం పాటకు విచ్చేశారు… బ్యాట్ వేలం పాట మొదలైంది…సినీహీరోలు పాట పాడటం ప్రారంభించారు..అంతా వేలల్లోనే పాడుతున్నారు..అతి కష్టం మీద 1.5 లక్షలకు చేరుకుంది పాట.. నిర్వహులకు నిరాశ..అంతలో తెల్లన ఫ్యాంట్ ,షర్ట్ ధరించి,మాసిన గడ్డం,చేతిలో గుడ్డసంచితో వచ్చాడొకవ్యక్తి.. వస్తూనే నా పాట ₹8,50000 (ఎనిమిది లక్షలా యాభైవేలు) అంటూ అరిచాడు,. అందరూ నిర్ఘాంతపోయారు.

NarayanaMurthy donates money to Orphange house

అగ్రహీరోలకు సహితం నోటిమాటరాలేదు.. నిర్వహకులు ఆనందంగా ఆయన పాటను ఫైనలైజ్ చేశారు.. తన వెంట తెచ్చుకున్న గుడ్డసంచిలోని డబ్బునంతా టేబుల్ మీద పోసి బ్యాట్ తీసుకొని దానిని ముద్దుపెట్టుకొని మళ్ళీ దానిని ఒక అనాధ శరణాలయానికి ఇచ్చేశాడు..నా దగ్గర అంత డబ్బేవుంది..లేకుంటే అంతకంటే ఎక్కువే పెట్టిపాడుందును అని నవ్వుతూ చేప్పాడావ్యక్తి.. అతనే రెడ్డి.బాబులు. ఉరప్ రెడ్డి.నారాయణమూర్తి నాయుడు.. పీపుల్స్ స్టార్ ..దాదాపు 25 సినిమాలు తీసినా..ఈ రోజుకీ సొంత ఇల్లులేని నటుడు..కేవలం ఒక చాప, దిండు అతని ఆస్థి,,తను సంపాదించినదంతా పేదలకే పంచాడు.. ఎక్కడ తను పెళ్ళిచేసుకుంటే సమాజసేవకు ఆటంకమవుతుందో అని పెళ్ళి చేసుకోకుండానే “బ్రహ్మచారి”గా మిగిలిపోయాడు..

హీరోలంటే ఆరడగులు, అందమైన ముఖం,కండలు తీరిన శరీరం కాదు…అందమైన మనసు … నారాయణమూర్తిగారే అతిగొప్ప హీరో!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here