శ్రీనగర్ చేరుకుంటున్న NSG కమాండోలు….

19
NSG Commandos Reach Kashmir For Anti Terror Ops

ఈనెల 27 నుంచి ప్రారంభం కానున్న అమర్‌నథ్ యాత్రపై ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ స్పష్టమైన సమాచారం ఇవ్వడంతో కేంద్రం ఈసారి ఎన్‌ఎస్‌జీ కమాండోలను రంగంలోకి దించింది.. వారిని శ్రీనగర్ లోని వివిధ ప్రాంతాలలో ఉంచనున్నారు, శ్రీనగర్ విమానాశ్రయంలో కూడా కొందరిని ఉంచనున్నారు.. అవసరమైతే వెంటనే హెలికాప్టర్లలో రంగంలోకి దిగేలా ప్లాన్ చేశారు.. ముఖ్యంగా యాత్రీకులను అపహరించి పట్టుకెళ్ళి చంపడమో లేక తమ డిమాండ్లను నెరవేర్చుకోవడం వంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి..

NSG Commandos Reach Kashmir For Anti Terror Ops
కమాండోలకు అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఆయుధాలు సమకూర్చినట్లు హోం మంత్రిత్వశాఖ ప్రతినిధి పేర్కొన్నారు..
ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేలా రియల్‌టైమ్ కమ్యూనికేషన్ వ్యవస్థను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here