శ్రీవారికి రెండు కోట్లతో సూర్యకఠారిని తయారు చేసిన తమిళ భక్తుడు

30
Tamil Nadu devotee to donate Rs 2-crore sword to Lord Venkateswara

రెండు కోట్లతో సూర్యకఠారిని తయారు చేసిన తమిళ భక్తుడు. ఖడ్గం విలువ 2 కోట్లు ఉంటుందని టిటిడి అంచనా

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారికి తమిళనాడుకు చెందిన ఓ భక్తుడు మంగళవారం స్వర్ణ సూర్య కఠారి, బంగారు ఖడ్గంని కానుకగా సమర్పించారు. తమిళనాడు తేని జిల్లా బోడినాయకలూర్‌కు చెందిన పారిశ్రామికవేత్త తంగదొరై సుమారు రెండు కోట్లతో దాదాపు 6 కిలోల బరువున్న స్వర్ణసూర్య కఠారిని తయారు చేయించారు. కుమారుడు రఘుతో కలిసి తంగదొరై నిన్న తిరుమల చేరుకున్నారు.

Tamil Nadu devotee to donate Rs 2-crore sword to Lord Venkateswara

ఇవాల తెల్లవారుజామున సుప్రభాత సేవకు హాజరై స్వర్ణసూర్య కఠారిని టీటీడీ అధికారులకు ఆలయంలో అందజేశారు. 1989లో కర్ణాటక ముఖ్యమంత్రిగా వీరేంద్ర పాటిల్‌ ఉన్న సమయంలో ప్రభుత్వం తరఫున శ్రీవారికి స్వర్ణ సూర్య కఠారిని సమర్పించారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే శ్రీవారికి ఈ అతిపెద్ద భారీ కానుక అందింది. ఇంత పెద్ద మొత్తంలో విరాళంగా స్వామికి కానుక ఇచ్చిన దాతను టిటిడి సగౌరవంగా అభినందించి స్వామి వారి దర్శనం ఏర్పాట్లు చేసి పంపారు.

Tamil Nadu devotee to donate Rs 2-crore sword to Lord Venkateswara

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here