జూలై 15 నుంచి గోల్కొండ బోనాలు

41
Telangana Bonalu 2018 To Begin From 15 July

తెలంగాణ ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే ప్రధాన పండుగ బోనాలు. నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగే ఈ ఉత్సవాలు వచ్చే నెల 15 ప్రారంభం కానున్నాయి. సంప్రదాయం ప్రకారం గోల్కొండ కోటలోని శ్రీ ఎల్లమ్మ(జగదాంభిక) ఆలయంలో ఉత్సవాలు ప్రారంభం కావడం ఆనవాయితీ. ఏటా ఆషాఢ మాసంలో అమావాస్య తర్వాత వచ్చే గురువారం లేదా ఆదివారం బోనాలు ప్రారంభం అవుతాయి. ఈ ఆషాఢంలో జూలై 13న అమావాస్య వస్తుండడంతో మొదటగా వచ్చే ఆదివారం నుంచి బోనాల జాతర మొదలుకానుంది.

Telangana Bonalu 2018 To Begin From 15 July

శ్రీ జగదాంభిక దేవాలయంలో మొదటి పూజ జరిగిన తర్వాత తెలంగాణలోని ఇతర జిల్లాల్లోని ఆలయాల్లో బోనాలు ప్రారంభం అవుతాయి. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి, లాల్దర్వాజ మహంకాళి ఆలయాల్లో పూజలు జరుగుతాయి. ఆషాడ మాసంలో చివరి రోజు తిరిగి గోల్కొండ కోటలోనే చివరి బోనం పూజ జరుగుతుంది. దీంతో ఉత్సవాలు సమాప్తం అవుతాయి. వేడుకల కోసం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని శ్రీ జగదాంభిక ట్రస్టు బోర్డు ఏర్పాట్లు మొదలు పెట్టింది. బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తర్వాత జరుగుతున్న నాలుగో వేడుక ఇది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here