100 కోట్లని ఎలా లెక్కగడతారు – రమణ దీక్షితులు

34
TTD Sent Notice To Ramana Deeshithulu

తనపై పరువు నష్టం కింద రూ.100 కోట్లు చెల్లించాలంటూ నోటీసులు పంపిన విషయంపై రమణ దీక్షితులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బుధవారం ఆయన హైదరాబాదు ప్రెస్క్లబ్లో మాట్లాడుతూ.. శ్రీ వెంకటేశ్వరస్వామి వారి పరువు తీశానని ఆరోపిస్తూ రూ.100 కోట్లను చెల్లించాలని టీటీడీ అధికారులు తనకు నోటీసులు పంపించారని, తన ఇష్టదైవమైన పూజించే కలియుగ దేవదేవుని పరువు విలువ రూ. 100 కోట్లని ఎలా లెక్కగడతారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెలకట్టలేని స్వామికి వెలకట్టిన ఘనత ఈ అధికారులకే దక్కిందని మండిపడ్డారు. చేసిన ఆరోపణలపై నిష్పక్షపాతమైన విచారణ జరపాల్సిందిపోయి, తనకు నోటీసులు ఏంటని అన్నారు. స్వామివారికి వైఖానస ఆగమ శాస్త్ర పద్ధతుల్లో అన్ని కార్యక్రమాలూ జరుగుతున్నాయని భక్తులకు నమ్మకం కలిగించే చర్యలు ఎక్కడ తీసుకున్నారని అడిగారు.

TTD Sent Notice To Ramana Deeshithulu

ఆరాధనలు, అభిషేకాలు, అలంకారాలు, నైవేద్యాలు సరిగ్గా జరుగుతున్నాయని నిరూపించుకోవాలని, స్వామి వారి ఆస్తులను, దివ్యమైన తిరువాభరణాలు భద్రమని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. నిరూపించుకున్న తరువాత తన ఆరోపణలు కనుక అసత్యమైతే తనపై పరువు నష్టం దావా వేసుకోవచ్చని అన్నారు. తనపై టీటీడీ అధికారులు రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేయడం సరికాదని, అధికారులకు ఈ సలహా ఇచ్చిన వ్యక్తిని చాలా పెద్ద బృహస్పతి గా భావిస్తున్నాని రమణ దీక్షితులు ఎద్దేవా చేశారు. కాగా, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశంలో అర్చక స్థానానికి 65 ఏళ్ల వయోపరిమితి విధించి ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులతో సహా మరో ముగ్గురిపై వేటు వేయడం, ఆ తరువాత రమణ దీక్షితులు ఆలయంలో జరుగుతున్న అవకతవకలపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడం, దీనికి సమాధానంగా తిరుమల తిరుపతి దేవస్థానం పరువు నష్టం కింద రమణ దీక్షితులు రూ.100 కోట్లు చెల్లించాలని ఆలయ అధికారులు నోటీసులు పంపడం తెలిసినవే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here