ట్రంప్ – కిమ్ చరిత్రాత్మక భేటీ

26
U.S. President Donald Trump – North Korea Leader Kim Jong Un Meeting Highlights

ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న అపురూప, అరుదైన సమావేశానికి సింగపూర్ వేదికైంది. సెంటసో ద్వీపంలోని కెపెల్లా ద్వీపంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ ల మధ్య శిఖరాగ్ర సమావేశం భేటీ అయ్యారు. కొద్ది నెలల క్రితం వరకూ పరస్పరం తిట్టిపోసుకున్న ఈ ఇద్దరు నేతలు కీలక చర్చలు జరిపారు. ఉత్తర కొరియాను అణునిరాయుధీకరణకు ఒప్పించడమే ప్రధాన ఎజెండాగా సింగపూర్ లోని కపెల్లా హోటల్లో అమెరికా, ఉ.కొరియా అధినేతల మధ్య ఈ శిఖరాగ్ర సమావేశం జరిగింది.

U.S. President Donald Trump – North Korea Leader Kim Jong Un Meeting Highlights

దాదాపు 48 నిమిషాలపాటు ట్రంప్, కిమ్ మధ్య చర్చలు జరిగాయి. అణ్వాయుధాల విషయంలో కిమ్తో ట్రంప్ చర్చించారు. అణ్వాయుధాలను వీడాలని, అణు నిరాయుధీకరణకు ఉత్తర కొరియా సహకరించాలని ట్రంప్ కిమ్ కు సూచించారు. ఇందుకు అంగీకరిస్తే.. ఉత్తర కొరియా భద్రతకు హామీ ఇస్తామని, దీనితోపాటు ఆర్థిక సాయం అందిస్తానని ట్రంప్ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కిమ్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నదని ఆసక్తికరంగా మారింది. మొదట ఏకాంత చర్చల అనంతరం ఇరుదేశాల దౌత్యనేతలతో అధ్యక్షులు సమావేశం అయ్యారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here