అరుదైన గౌరవం అందుకొన్న నటుడు నరేష్

38

ఐక్యరాజ్యసమితి కి చెందిన ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ఇంటర్నేషనల్ కమిషన్ ఫర్ డిప్లమాటిక్ రిలేషన్స్హ్యూమన్ రైట్స్ & పీస్, టాలీవుడ్ నటుడు డాక్టర్ వి.కె.నరేష్ ను కౌన్సిల్ జనరల్ (కల్చరల్ ఎఫైర్స్) గా నీయమించింది. మార్చి 17న ఫిలిప్పినీస్ రాజధాని మనిలలో ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ఫిలిప్పినీస్ దేశాధ్యక్షుడు రోడిగ్రో ఆర్.దుటురోస్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ ప్రమాణ స్వీకరణోత్సవానికి 1500 మంది ఆగ్నేయ ఆసియా దేశాలకు ప్రముఖులుప్రతినిధులు హాజరు అయ్యారు.

ఈ సందర్భంగా సౌత్ ఈస్ట్ ఏషియా ఛాన్సలర్ జనరల్ మరియు ఇండియన్ అంబాసిడర్ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. కేవలం నటుడిగానే కాకుండా సామాజిక ధృక్పధాన్ని గుర్తించి ఈ బాధ్యతాయుత మైన పదవిని ఇచ్చాం. ఐక్యరాజ సమితిచే కౌన్సిల్ జనరల్ గా నియమించబడిన మొట్టమొదటి నటుడు డాక్టర్ వి.కె.నరేష్ గారు అని ఆయన అన్నారు.  ఇదే సందర్భంలో నరేష్ తన సెకండ్ డాక్టరేట్ (H.E – His Excellence) ను కూడా అందుకోవడం విశేషం. యూనియటెడ్ నేషన్స్ గ్రూప్ కి చెందిన U.N ICDRHRP ఈ డాక్టరేట్ ను నరేష్ కి అందించింది. ఇంత గొప్ప పురస్కారాలు అందుకున్న వారు మన తెలుగు కావడం ఎంతో గర్వకారణం అని పలువులు సినీ నటులు తెలుపుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here