అసెంబ్లీ సెట్ లో భారత్ అనే నేను ఆడియో వేడుక

67

“కొరటాల శివ” దర్శకత్వం లో సూపర్ స్టార్ “మహేష్ బాబు” హీరో నటిస్తున్న చిత్రం “భారత్ అనే నేను” ఏప్రిల్ 20 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. ఈ చిత్రానికి మొదటగా  ఫస్ట్ ఓత్ పేరుతో ముఖ్యమంత్రిగా మహేష్ ప్రమాణం చేస్తున్న వాయిస్ ని విదుల చేసారు… ఆ తర్వాత ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు భారత్ అనే నేను టీం .  ఈ మధ్యనే ఈ చిత్ర టీసర్ ని  ది విజన్ ఆఫ్ భరత్’ పేరుతో రిలీజ్ చేసారు.  మొన్న ఉగాది కి పంచెకట్టుతో ఉన్న ముఖ్యమంత్రి లుక్ ని విడుదల చేసారు… మరి కొన్ని రోజుల్లో డైరెక్ట్ గా పాటలు మార్కెట్ లోకి రిలీజ్ కానున్నాయి. ఆ తరువాత ఆడియో వేడుకను నిర్వహించడానికి చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తోంది.

ఈ వేడుక కోసం ప్రత్యేకంగా అసెంబ్లీని పోలిన సెట్ వేసి…ఆడియో వేడుకను నిర్వహించనున్నారు. ప్రస్తుతం పండుగ నేపథ్యంలో పాటని షూట్ చేస్తున్నారు .ఒక పాట ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో చిత్రీకరణ జరుగుతుంది. దీని తర్వాత మిగిలిన పాట కోసం విదేశాలకు వెళ్లనున్నారు. అక్కడి షెడ్యూల్ పూర్తి కాగానే ఆడియో విడుదల జరుగనుంది. స్టార్ నిర్మాత డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ పాటలు అందిస్తున్నారు. ఈ చిత్రం లో మహేష్ కి జంట “కైరా అద్వాని” నటిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here