ఆర్టిస్ట్ గా ఈర్ష పడుతున్నా..తండ్రి గా గర్వ పడుతున్న – మెగాస్టార్ చిరు

50
ఆదివారం వైజాగ్ లో జరిగిన రంగస్థలం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ప్రతేక అతిధి గా వచ్చారు ఈ సందర్భంగా చిరంజీవి మాట్లడుతూ…..  రంగస్థలం మిమ్మల్ని అలరిస్తుంది. ఇది అభిమానుల ఆశీస్సుల తోటి సూపర్  హిట్ అవుతుంది అన్నారు. నాకు ఖైదీ నెం 150 లాగా రామ్ చరణ్‌ కు రంగస్థలం కూడా అలాంటి సినిమానే అని అన్నారు. రాంచరణ్‌ కు స్టార్ స్టేటస్‌‌ పెంచే.. చరణ్ నటుడి గా మరో మెట్టు ఎదిగే సినిమా రంగస్థలం అవుతుంది. ఇదే మాట అందరు చెప్పారు ఇది సత్యం. డైరెక్టర్ సుకుమార్ ఈ అవకాశం చరణ్‌ కు.. ఇవ్వడం ఆర్టిస్టుగా ఈర్ష్య పడుతున్నాను.. తండ్రిగా గర్వపడుతున్నాను అని అన్నారు. డైరెక్టర్‌కు సుకుమార్ కి థాంక్స్…. సుకుమార్ చిన్నతనం అంతా గ్రామంలో పెరిగాడు గనుక బంధాలు,బాంధవ్యాలు,సెంటిమెంట్స్ ఇవన్నీ కూడా అతనికి నరనరాల్లో తన రక్తంలో అలానే ఉంది పొయ్యాయి అన్నారు. అందుకే రంగస్థలం మూవీ ని అలవోక గా తీసేశాడనిపిస్తోంది. ఎలాంటి పొల్యూట్ అనేది లేకుండా పాటలన్నీ చాలా బాగున్నాయి.
జనాల్ని మెప్పించగలనని సాంగ్స్ కూడా సుకుమార్ చాలా నాచురల్‌గా తీశారే తప్ప భారీ సెట్స్ ఏమీ వేయలేదు. సినిమాలో నాటుతనం,మొరటుతనం,మోటుతనం అంతా ఉంటుంది. ఈ సినిమా చూస్తున్నంత సేపు మన విలేజ్‌‌లోనే ఉన్నట్లుగా ఎక్స్‌పీరియన్స్ చేసే అవకాశం ఈ రంగస్థలం ద్వారా వస్తుంది. ఈ సినిమాలో రకరకాలు ఎమోషన్స్ ఉంటాయ్.. చిట్టచివరి వరకు చాలా బాగుంది. కథ నాకు చెప్పినప్పుడు చాలా చిన్న లోకల్ పాలిటిక్స్ ఎలా సస్టైన్ చేస్తాడనే అనుమానం ఉండేది.
హీరోకు వినికిడి లోపం అంటే అసలిది అడ్వాంటేజా? డిస్‌అడ్వాంటేజా? అభిమానులు ఎలా తీసుకుంటారో? అనే డౌట్ వచ్చింది అన్నారు. సార్ నన్ను నమ్మండి అని సుకుమారు అన్నాడు.. సినిమాను ఎంటర్‌టైన్‌గా,ఎమోషన్ ఉండేలాగా చేస్తానని అన్నారు. తీరా సినిమా చూస్తే అనుకున్నట్లుగానే నవ్వులు కురిపించి ఎంటర్‌టైన్ చేసి గుండెను పిండి.. కన్నీళ్లొచ్చేలా చేసిన సుకుమార్ ధైర్యానికి శభాష్ అని కొనియాడారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here