డైరెక్టర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన ఎన్.శంకర్

43

ఎన్ కౌంటర్, శ్రీరాములయ్య, జయం మనదేరా, జై బోలో తెలంగాణ వంటి ఉద్యమ నేపద్యం తో నడిచే సినిమాలతో ఆకట్టుకున్న డైరెక్టర్ ఎన్.శంకర్.తెలుగు చలన చిత్ర దర్శకుల మండలి ఎన్నికల్లో  అధ్యక్షుడి గా ఎన్నికయ్యారు. ప్రత్యర్థి సానా యాదిరెడ్డిపై 310 ఓట్ల మెజారిటీతో శంకర్‌ విజయం సాదించారు.

ఎన్‌.శంకర్‌తో పాటు ఆయన ప్యానల్‌ సభ్యులు ప్రధాన కార్యదర్శిగా జి. రాం ప్రసాద్, కోశాధికారిగా కాశీ విశ్వనాద్, ఉపాధ్యక్షులుగా ఏ.యస్‌.రవి కుమార్‌ చౌదరి, ఎస్‌.వి.భాస్కర్‌ రెడ్డి, సంయుక్త కార్యదర్శులుగా కట్టా రంగారావు, ఎమ్‌.ఎస్‌.శ్రీనివాస్, కార్యనిర్వాహక కార్యదర్శులుగా డీవీ రాజు(కళింగ), ఎన్‌ గోపీచంద్‌ తదితరులు ఎన్నిక అయ్యారు.

కార్యవర్గ సభ్యులుగా డైరెక్టర్స్ శ్రీకాంత్‌ అడ్డాల, అనిల్‌ రావిపుడి….   ప్రియదర్శిని, గంగాధర్, అంజిబాబు, మధుసూదన్‌ రెడ్డి, కృష్ణ మోహన్, కృష్ణ బాబు, చంద్రకాంత్‌ రెడ్డి విజయం సాధించారు. నూతన కార్యవర్గం రెండు సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగుతుంది. కాగా ….ఈ సందర్భంగా పలువురు ఎన్ శంకర్ కి శుభాకాంక్షలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here