తమిళ దర్శకుడి తో రానా కొత్త సినిమా

46
బాహుబలి చిత్రంతో తనకంటూ ఒక ప్రతేకమైన గుర్తింపు తెచ్చుకున్న దగ్గుపాటి రానా…ఆయన సోలో హీరో గా చేసిన ఘాజి, నేనే రాజు నేనే మంత్రి వంటి సినిమాలు కూడా విజయాలను దక్కించుకున్నారు. ప్రస్తుతం “హాథీ మేరె సాథి” అనే హిందీ చిత్రంలో హీరో గా నటిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో కూడా ఒకే సారి విడుదల కానుంది. ఈ చిత్రం తెలుగులో “అడవి రాముడు” అనే టైటిల్ తో రానుంది.
ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది.. ఏనుగుతో కలిసి ఉన్న రానా లుక్ చాలా కొత్త గా ఉంది. ఈ చిత్ర షూటింగ్ థాయిలాండ్ అడవుల్లో చేస్తున్నారు. అడువుల నేపధ్యం కావటం తో అక్కడి షూటింగ్ చేస్తున్నారు.
ఈ చిత్రం తో  బిజీగా ఉన్న రానా మరో కథ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సిద్ధార్థ్ హీరోగా “గృహం” అనే మూవీ చేసిన  ”మిళింద్ రాయ్” రీసెంట్ గా రానాకి ఒక కొత్త కధ చెప్పాడు అంట. ఆ స్టొరీ నచ్చటం తో ఒకే చెప్పాడు అంట .త్వరలో పూర్తి వివరాలు తెలియనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here