నంది అవార్డులు పంచుకున్నారు : తమ్మారెడ్డి

41

నంది అవార్డులు తీసుకోలేదు.. ఎవ్వరికి వారు పంచుకున్నారని దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వాఖ్యలు చేసారు. నంది అవార్డులు తీసుకున్నపుడు గొడవ చేశామన్నారు కదా..ఆ నంది అవార్డు కమిటీలు వేసింది కూడా మీ (చంద్రబాబు నాయుడు)కదా అని . తమరు పంచిన నంది అవార్డులు తీసుకున్న వారు ఈ విషయం పై ఎందుకు స్పందించరని ఆయన అన్నారు. ఆడవాళ్ల అందాల తో సినిమా తీసేవాళ్లు తమరి పక్కనే ఉన్నారు కదా వారెందు కు హోదా కోసం పోరాడరు అని సూటి గా ప్రశ్నించారు. తాము ఏసీ ల్లో కులుకుతున్నామా..?….. మీరే లంచాలు తిని ఎసి లలో కులుకుతున్నారని ఆయన సంచలన వాఖ్యలు చేసారు.

తాము రాత్రిపగలు కష్టపడితే పది మందికి అన్నం దొరుకుతున్నదని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.మీకు కి ప్రత్యేక హోదా విషయం కంటే జగన్‌ మోహన్ రెడ్డి ,నరేంద్ర మోదీ పవన్‌ కళ్యాణ్ ఎక్కడ కలుస్తారనే విషయం భయంగా ఉందనిఅందుకే సినిమా వాళ్ల ఫై ఇలా మాట్లడుతున్నారు. ప్రత్యేక హోదా సాధ్యం కాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎప్పుడో చెప్పారు… కానీ అప్పటి నుంచీ మౌనంగా ఉన్న చంద్రబాబు నాయుడు కి ఇప్పుడెందుకు గుర్తుకొచ్చిందని ఆయన అన్నారు. సినిమా వాళ్ల భార్యల గురించి అసభ్యంగా మాట్లాడినపుడు మాట్లాడని వారు ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని ఆయన. టీడిపి నేత సినిమా వాళ్ళఫై చేసిన వాఖ్యలు ఇప్పుడు అంతట దుమారం లేపుతున్నాయి…చూడాలి ఇంకా ఎంత మంది ఈ వాఖ్యాల ఫై స్పందిస్తారో ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here