నేల టిక్కెట్టు గా వస్తున్నా మాస్ మహారాజ రవితేజ

74
“ఎస్ ఆర్‌ టి ఎంటర్టైన్మెంట్స్” బ్యానర్‌ పై రామ్ తాళ్లూరి మొదటి సరిగా నిర్మిస్తున్న చిత్రాన్ని సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడుక చూద్దాం లాంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో,  మాస్ మహారాజా ‘రవితేజ’ హీరోగా వస్తున్నా చిత్రం సినిమా ఫస్ట్ లుక్‌ని ఉగాది కి శనివారం రోజు రిలీజ్ చేసారు.. ఈ సందర్భంగా హీరో రవితేజ ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. క్లాస్ మాస్ మేళవింపుతో ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి “నేల టిక్కెట్టు” పేరు ఖరారు చేశారు.
రవితేజ సరసన హిమాలయ యాడ్ లో నటించిన ముంబై భామా “మాళవిక శర్మ” హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, బ్రహ్మానందం, జయప్రకాశ్, రఘుబాబు, సుబ్బరాజు, ఆలి, పోసాని కృష్ణమురళి, అన్నపూర్ణమ్మ, ప్రియదర్శి, ప్రభాస్ శ్రీను, పృథ్వీ, సురేఖా వాణి, ప్రవీణ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
దాదాపు 60% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మే 24న విడుదల చెయ్యనున్నారు. ఫిదా ఫేం శక్తికాంత్ కార్తీక్ సంగీతం, ఛోటా కే ప్రసాద్ కూర్పు, బ్రహ్మ కడలి కళ, ముఖేష్ ఛాయాగ్రహణం సమకూరుస్తున్నారు…మొన్నటి వరకు ఈ చిత్ర షూట్ వైజాగ్ లో జరుపుకుంది… ఇప్పుడు హైదరాబాద్ లో వేసిన బారి సెట్ లో ఒక పాట షూట్ చెయ్యనున్నారు… వచ్చే నెల లో షూట్ కి గుమ్మడి కాయ కొట్ట నున్నారు. ఈ చిత్రం తరువాత వెంటనే అమెరికా వెళ్లనున్నాడు రవితేజ .. మాస్ రాజ తదుపరి చిత్రం నికి శ్రీను వైట్ల దర్శకుడు  “అమర్ అక్బర్ అంటోనీ” అనేది టైటిల్.. ఈ చిత్ర షూటింగ్ కోసం రవితేజ అమెరికా వెళ్లనున్నాడు… ఈ చిత్రం లో రవితేజ సరసన అను ఎమ్మానునల్ నటిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here