పంచె కట్టిన ముఖ్యమంత్రి …. ఎవరో తెలిస్తే చూడకుండా ఉండలేరు

44
పంచె కట్టిన ముఖ్యమంత్రి అంటే ..తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ హ లేక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హ అని ఆలోచిస్తున్నారా …? వాళ్ళు ఎవ్వరు కాదు…
మహేష్‌బాబు కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న చిత్రం “భరత్‌ అనే నేను”డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో కైరా అడ్వాణీ కథానాయిక. ఏప్రిల్‌ 20 న సినిమాను విడుదల చేస్తున్నారు. ఉగాది పర్వదిననా భారత్ అనే నేను టీం పంచె కట్టులో ఉన్న మహేష్‌ పోస్టర్‌ ఒక్కటి రిలీజ్ చేసింది. ఈ పంచెకట్టులో ఉన్న ఫోటో ని చూసి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులు వారి ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. నిర్మాత దానయ్య మాట్లాడుతూ …తెలుగు సంవత్సరాది పండగ కళ ఉట్టిపడే పంచె కట్టుతో ఉన్న మహేశ్‌ పోస్టర్‌ను విడుదల చేశాం.
ప్రేక్షకులకు,అభిమానులకు మహేష్‌ కొత్త లుక్‌ కనువిందు చేస్తోంది. ప్రస్తుతం డాన్స్ మాస్టర్ “రాజు సుందరం” నేతృత్వంలో భారీ టెంపుల్‌ సెట్‌లో వందమంది డాన్సర్లు 1000 మందికి పైగా జూనియర్‌ ఆర్టిస్టుల తో ఓ పాటను చిత్రీకరిస్తున్నాం. ఈ నెల 25 నుంచి స్పెయిన్‌లో షెడ్యూల్‌ ఉంటుంది. అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసి ఏప్రిల్‌ 20 న సినిమాను ప్రపంచవ్యాప్తంగా  రిలీజ్ చేస్తాం అని ప్రొడ్యూసర్ దానయ్య అన్నారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు… ఈ చిత్రం దేవి శ్రీ ప్రసాద్ కి 100 వ సినిమా కావటం విశేషం… ఈ చిత్రం లో ని తొలి పాటను త్వరలో రిలీజ్ చెయ్యనున్నారు అని తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here