పొరపాటున రంగస్థలం ట్విస్ట్ ని లీక్ చేసిన చిరు

38

ఉగాది రోజున విశాఖలోని ఆర్కే బీచ్‌లో మెగా అభిమానుల గ్రాండ్ గా రంగస్థలం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ట్రైలర్‌ లాంచ్‌ జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్‌ చిరంజీవి అతిథిగా వచ్చారు. కాగా ఈ కార్యక్రమం లో మాట్లాడిన మెగా స్టార్ చిరంజీవి …..  రంగస్థలంలోని ట్విస్ట్‌ చెప్పేశాడు. ఈ సినిమా చూశా… ప్రతీ సన్నివేశం అభిమానులన అలరిస్తుందనీఆర్టిస్ట్‌ గా  రామ్ చరణ్‌ ను చూసి అసూయపడుతున్నాననీతండ్రిగా గర్వ పడుతున్నానని ఉద్వేగంగా చెప్పారు.

 ఈ సినిమా 1985 అప్పటి కథ  రాజకీయ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది. అయితే ఇందులో ఇక ఒక  ట్విస్ట్‌ ఉంటుంది అని ఫస్ట్ మాట్లాడిన డైరెక్టర్ సుకుమార్ అన్నారు….. ఆ తరువాత మాట్లాడిన చిరంజీవి …కుమార్‌బాబు(ఆది పిన్నిశెట్టి ) చనిపోతాడని చిరు చెప్పేయడంతో అందరికి తెలిసిపోయింది.  కుమార్‌బాబు తమ్ముడు చిట్టిబాబు ఎం చేసాడు అనేది స్టొరీ అని అర్ధం అవుతుంది. ఈ విషయం చెప్పాలి అని చెప్పారో …ప్రమోషన్ లో భాగంగా …అనుకోకుండా చెప్పారో ..మరి ..

అయితే అనసూయకు సంబంధించిన పాత్ర కూడా ప్రేక్షకులకు తెలిసిపోయింది. రంగమ్మత్త క్యారెక్టర్‌లో అనసూయ నటించినట్లు ఆమె తన ఫేస్బుక్ , ట్విట్టర్ లో అనౌన్స్ చేసారు. గతం లో ఇదే విషయమై అనసూయను అడగ్గా అలాంటిదేమీ లేదని దాటేసింది. కానీ అదే నిజమని తేలిపోయింది. చరణ్‌ పక్కన అత్తగా చేయాలంటే మొదట ఒప్పుకోలేదనీసుకుమార్‌ కోసమే ఈ క్యారెక్టర్‌ చేసినట్లు చెప్పిన అనసూయఈ పాత్ర తనకెంతో ప్రత్యేకమని చెప్పుకొచ్చింది. ఈ సినిమా గ్రాండ్ గా ఈ నెల 30 న ( మార్చ్ 30 ) రిలీజ్ కాబోతుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here