రికార్డుస్తాయిలో కిరాక్‌పార్టీ వసూళ్లు

61
ఎన్ని హిట్లు వచ్చిన స్టార్ సరసన నిలబడ లేక పోతున్నాడు యంగ్ హీరో నిఖిల్ ……”స్వామిరారా” సినిమాతో హిట్ల బట పట్టిన హీరో నిఖిల్‌… స్వామి రారా మూవీ నుంచి వైవిధ్యభరితమైన కథలతోనే సినిమాలు చేస్తున్నాడు తన కంటూ ఒక బ్రాండ్ ఒక్కటి క్రియెట్ చేసుకుంటున్నాడు. కన్నడ లో సూపర్ హిట్ అయిన “కిర్రిక్ పార్టీ” ని తొలి సారి తన కెరీర్ లో రీమేక్ చేసాడు నిఖిల్… ఆ మూవీ తెలుగు లో కిరాక్‌పార్టీ గా….. వచ్చింది ఈ శుక్రవారం ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. ఇప్పుడు ఆ సినిమా వసూళ్లలో దూసుకెళ్లిపోతోంది.
ఈ వారం కిరాక్‌పార్టీ మినహా ఏ సినిమాకు పాజిటివ్‌టాక్‌ రాకపోవడం…నిఖిల్‌కు ఉన్న క్రేజ్‌ దృష్ట్యా వీకెండ్‌లో ఈ సినిమా కలెక్షన్స్‌ పరంగా దుమ్ముదులిపింది. దీంతో మూడు రోజుల్లో దాదాపు పదికోట్ల వసూళ్లను సాధించింది. ఇలా ఈ క్రేజ్ నడుస్తే …వసూళ్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ చిత్రానికి స్వామి రారా,దోచేయ్,కేశవ చిత్రాల దర్శకుడు  “సుధీర్‌ వర్మ” స్క్రిన్ ప్లే ఇచ్చాడు , కార్తికేయ , ప్రేమమ్ చిత్రాల దర్శకుడు “చందూ మొండేటి” మాటలను అందించగా శరణ్‌ కొప్పిశెట్టి తొలి సారి దర్శకత్వం వహించారు.నిఖిల్ సరసన సిమ్రాన్ పరింజ , సంయుక్త నటించారు…. ఎ.కే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ….”అనిల్ సుంకర” ఈ చిత్రానికి నిర్మాత.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here