విడులైన గోపీచంద్ “పంతం” ఫస్ట్ లుక్

48

గౌతమ్ నంద మూవీ తరువాత గోపీచంద్ నటిస్తున్న చిత్రం “పంతం”. ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ బ్యానర్‌ పై కె.చక్రి (చక్రవర్తి) దర్శకుడి గా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రం లో గోపిచంద్‌ సరసన మెహరీన్‌ కధానాయకి గా నటిస్తున్నారు. ఇప్పుడు వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం…ఈ రోజు ఈ సినిమా ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ ను ”పంతం” చిత్రయూనిట్ విడుదల చేశారు.ఈ ఫస్ట్ లుక్ లో గోపీచంద్ రఫ్ లో అదరగొట్టాడు. ఈ చిత్రం గోపీచంద్ కెరీర్ లో 25 వ చిత్రంగా రుపుద్దికుంటుంది.

“కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌” గా వస్తున్నా ఈ చిత్రంలో పృథ్వీజయప్రకాష్ రెడ్డిలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి “గోపి సుందర్” సంగీతం అందిస్తున్నాడు. మే లో ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యటానికి ప్లాన్ చేస్తున్నారు ఈ చిత్రయునిట్. మొదటగా ఈ చిత్రాన్ని మాస్ మహ రాజ రవితేజ “రాబిన్ హుడ్” టైటిల్ చెయ్యాలి అనుకున్నాడు…కొన్ని అనివార్య కారణాలతో ఆగిపోయింది…ఇప్పుడు ఈ చిత్రం గోపీచంద్ దెగ్గరికి రావటం తో ఆయన కు బాగా నచ్చడం తో చేస్తున్నాడు…రవితేజ చెయ్యని స్టొరీ తో గోపీచంద్ హిట్ కొడతాడో? లేదో ? చూడాలి !!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here