వైఎస్ఆర్ బయోపిక్ లో హీరో ఫిక్స్.. ఎవరో తెలుసా!!!

44

“ఆనందో బ్రహ్మ” మూవీ తో డైరెక్టర్  మహి వి రాఘవ్ మంచి హిట్ కొట్టాడు ఆ తరువాత తన తదుపరి మూవీ గా ఒక బయోపిక్ చేస్తున్నాడు … మాజీ ముఖ్యమంత్రి “వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి” బయోపిక్‌ ని  చేస్తున్నాడు.  మహి వి రాఘవ్ స్వయంగా కధ రాసుకుని ఈ చిత్రాన్ని తియ్యబోతున్నాడు.. ఈ చిత్రంలో వైఎస్ఆర్ పాత్రను ఇన్ని రోజులు ఎవ్వరు చేస్తున్నారు అని చూసారు… ఇప్పుడు ఇందులో రాజశేఖర్ రెడ్డి పాత్ర ని మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది.ఈ చిత్రాన్ని భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ’ వంటి సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన “70ఎంఎం ఎంటర్టెన్మెంట్స్” బేనర్ పై నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి “యాత్ర” అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేసారు.

ఈ సందర్భంగా ఈ చిత్ర నిర్మాతల్లో ఒక్కరు విజయ్ చిల్లా మాట్లాడుతూ.. ‘ఆనందో బ్రహ్మ’తో తమ సంస్థకు రెండో విజయాన్ని ఇచ్చిన డైరెక్టర్ “మహి వి రాఘవ్” డైరెక్షన్‌లో మరో సినిమాను నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. ‘యాత్ర’ కోసం మహి రెడీ చేసిన లైన్ నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నాం అని తెలిపారు. వైఎస్ఆర్ పాత్ర లో న‌టించ‌డానికి మెగాస్టార్ మమ్ముట్టి గారు అంగీకరించడం చాలా ఆనందం గా ఉంది అన్నారు. రెండు రాష్ట్రాల ప్రజలు ఆరాధించే నాయకుడు, ఎమోషనల్ గా ప్రజలకు దగ్గరైన వ్యక్తి వైయస్ రాజశేఖర్ రెడ్డి … ఆయన జీవితంలో జరిగిన కొన్ని ప్రముఖ సంఘటన‌ల‌ ఆధారంగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్త్నట్లు వారు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here