వైజాగ్ లో మహేష్ బాబు “భారత్ అనే నేను” ప్రీ రిలీజ్

53
సూపర్ స్టార్ మహేష్ బాబు స్పైడర్ మూవీ తరువాత నటిస్తున్న తాజా చిత్రం “భరత్ అనే నేను” సమ్మర్ కానుకగా ఏప్రిల్ 20 న విడుదల కానుంది. వరుస హిట్టులు అందుకున్న డైరెక్టర్ “కొరటాల శివ” ఈ చిత్రానికి దర్శకుడు. సినిమా ప్రమోషన్స్ ఊపందుకొన్నాయి. త్వరలో ఈ చిత్రం పాటలు డైరెక్ట్ గా ఆన్లైన్ లో రిలీజ్ కానున్నాయి. భారీ స్థాయిలో ప్రీరిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు.
ఏప్రిల్ 7న ఈ భారీ ప్రీరిలీజ్ ఈవెంట్ ను విశాఖపట్నంలో జరగనుంది. మహేష్ బాబు కెరీర్ లో విశాఖపట్నం లో జరగబోయే మొట్టమొదటి ఈవెంట్ ఇది. ఇంకా టీం నుంచి అనౌన్స్ మెంట్ రాకున్న ఆ డేట్ ఏ ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. మహేష్ బాబు సరసన బాలీవుడ్ భామ “కైరా అద్వానీ” హీరోయిన్ గా నటిస్తుంది, డి.వి.వి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఆల్రెడీ విడుదలైన ఆడియో టీజర్, పోస్టర్స్ మరియు టీజర్ సినిమా మీద అంచనాలను విపరీతంగా పెంచేశాయి. ఉగాది కి రిలీజ్ అయిన పోస్టర్ కి కూడా మంచి స్పందన లబిస్తుంది. ఈ చిత్రం లో మహేష్ బాబు ఒక యంగ్ ముఖ్యమంత్రి పాత్ర ని పోషిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here